15 April, 2026 | 1:18 PM

Breaking News

టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యుడుగా షాద్‌నగర్ మాజీ ఎమ్మెల్యే బక్కని నరసింహులు   •   మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •  

హెల్పింగ్ హార్ట్స్ ఉచిత వైద్య శిబిరం

26-02-2026 03:05 PM

ఆరోగ్య సంరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలి.

హెల్త్ క్యాంప్‌లో నిపుణుల సూచనలు

రాజన్నసిరిసిల్ల,(విజయక్రాంతి): హెల్పింగ్ హార్ట్స్ వెల్ఫేర్ సొసైటీ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో రాజీవ్ నగర్‌లోని చేనేత సహకార సంఘంలోని కార్మికులు కుటుంబ సభ్యుల కోసం ఉచిత ఆరోగ్య శిబిరాన్ని హెల్పింగ్ హార్ట్స్ అధ్యక్షుడు అలువాల ఈశ్వర్  మెడికవర్ హాస్పిటల్ వైద్య బృందం సౌజన్యంతో ఏర్పాటు చేయడం జరిగింది.ఈ హెల్త్ క్యాంప్‌లో  డాక్టర్ విద్యాప్రకాశ్  పాల్గొని సాధారణ ఆరోగ్య పరీక్షలు, రక్తపోటు, షుగర్, బరువు, హీమోగ్లోబిన్, ఇ.సి.జీ. వంటి పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి వైద్య సూచనలు అందించారు. వైద్యులు కార్మికులకు ఆరోగ్య పరిరక్షణపై అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా నిపుణులు పలు సూచనలు చేశారు. ఆరోగ్యాన్ని క్రమం తప్పకుండా పరీక్షించుకోవాలనీ తెలిపారు.పౌష్టికాహారం తీసుకోవడం ద్వారా శరీరానికి కావలసిన పోషకాలు అందించాలన్నారు.

రోజుకు కనీసం 7–8 గంటలు నిద్రపోవాలనీ తెలిపారు. సైకాలజిస్ట్ కె పున్నంచందర్ మాటాడుతూ... జీవన విధానంలో సానుకూల మార్పులు చేసుకోవాలనీ అన్నారు. వ్యాయామం నడకను అలవాటు చేసుకోవాలనీ కోరారు.మానసిక ఆరోగ్యానికీ ప్రాధాన్యత ఇవ్వాలనీ తెలుపుతూ అవసరమైన సందర్భంలో మైండ్ కేర్ సెంటర్ ను సంప్రదించాలని కోరారు.హెల్పింగ్ హార్ట్స్ అధ్యక్షుడు అలువల ఈశ్వర్ మాటాడుతూ కార్మికుల ఆరోగ్య పరిరక్షణ సమాజ అభివృద్ధికి కీలకమని  పేర్కొన్నారు.

భవిష్యత్తులో కూడా ఇటువంటి ఆరోగ్య శిబిరాలను నిర్వహించేందుకు కార్యాచరణ చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో హెల్పింగ్ హార్ట్స్ వెల్ఫేర్ సొసైటీ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు అలువల ఈశ్వర్, సైకాలజిస్ట్ కె. పున్నం చందర్, అడ్వకేట్ దాసరి తిరుమల, ఆసుపత్రి సిబ్బంది లక్ష్మీరాజం, శ్రీకాంత్ , నర్సులు, సహకార సంఘం అధ్యక్షులు మూషం రాజయ్యా కార్మికులు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.