15 April, 2026 | 1:16 PM

Breaking News

టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యుడుగా షాద్‌నగర్ మాజీ ఎమ్మెల్యే బక్కని నరసింహులు   •   మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •  

చెరబండ రాజు నగరవాసులకి న్యాయం చేయాలి

26-02-2026 03:00 PM

ప్రజా వేదిక రాష్ట్ర చైర్మన్ తిరునహరి శేషు

హనుమకొండ,ఫిబ్రవరి 26 (విజయ క్రాంతి): భద్రకాళి అమ్మవారి మాడవీధుల నిర్మాణం కోసం దశాబ్దాలుగా స్థిరనివాసం ఏర్పాటు చేసుకుని జీవిస్తున్న చెరబండ రాజు నగరవాసులను ఖాళీ చేయించే ప్రయత్నాలు చేయటం ఎంతవరకు సమంజసమని ప్రజావేదిక రాష్ట్ర చైర్మన్ డాక్టర్ తిరునహరి శేషు ప్రశ్నించారు. గతంలో అనేక సందర్భాలలో ఆ కాలనీని అధికారులు ఖాళీ చేయించటానికి చేసిన ప్రయత్నాలను హైకోర్టు స్టే ఆర్డర్ ద్వారా రక్షణ కల్పించటం జరిగిందని, పేదలు దళితుల ఇళ్ళు కూల్చివేయకుండా డాక్టర్ తిరుణహరి శేషు, అడ్వకేట్ బూర రమేష్ లు హైకోర్టు నుండి స్టే ఆర్డర్స్ తీసుకొచ్చి చెరబండ రాజు నగర వాసులకి సహాయంగా నిలబడ్డామని అన్నారు. వివిధ రాజకీయ పార్టీల నాయకులు రాజకీయం చేయకుండా ఆ ప్రాంతంలో నివసించే ప్రజలను రక్షించే చర్యలు చేపట్టటం తో పాటు ఆ నగర ప్రజల డిమాండ్ లను నెరవేర్చే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.