17 April, 2026 | 3:16 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయమ్మ దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం..

26-02-2026 03:07 PM

కళ్యాణ లక్ష్మీ చెక్కు‌లు పంపిణి చేసిన ఎమ్మెల్యే కోరం కనకయ్య

టేకులపల్లి, (విజయక్రాంతి): రాష్ట ప్రభుత్వం ఆర్ధికంగా లోటులో ఉన్నా ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రజా ప్రభుత్వం పని చేస్తుందనీ ఎమ్మెల్యే కనకయ్య(MLA Koram Kanakaiah) అన్నారు. సంక్షేమ పధకాలు అమలుతో పాటు, అన్ని రంగాల పురోగతి దిశగా పయనిస్తుందన్నారు. టేకులపల్లి మండలం ముత్యాలంపాడు క్రాస్ రోడ్ లోని రైతు వేదికలో గురువారం 144 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. టేకులపల్లి లో ప్రజా ప్రభుత్వం రోడ్లు, బ్రిడ్జ్ లు అభివృధ్ధి చేస్తున్నామన్నారు. పేదల కోసం ఆలోచన చేసే ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అన్నారు. ఇందిరమ్మ ఇళ్ళు అర్హులందరికి ఇస్తున్నామని ఎప్రియల్ నెలలో మరలా ఇస్తామన్నారు. ప్రజా ప్రభుత్వ పనితీరుకు సర్పంచ్ ఎన్నికలు, మున్సిపాలిటి ఎన్నికల ఫలితాలే నిదర్శనమన్నారు. 

రూ.1.45 కోట్ల విలువైన చెక్కులు లభ్ధిధారులకు మనదేశమని ఎమ్మెల్యే తెలిపారు. నియోజకవర్గ కేంద్రంలో ఈ నెల 28న జరిగే సంతు సేవాలాల్ జయంతి ముగింపు వేడుకల గోడ పత్రికలను ఎమ్మెల్యే ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో టేకులపల్లి తహసీల్దార్ వీరభద్రం, జిల్లా కాంగ్రెస్ నాయకులు కోరం సురేందర్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భుక్యా దేవా నాయక్, నాయకులు ఈది గణేష్, సర్ధార్ మండలంలోని పలు గ్రామ పంచాయతీల సర్పంచులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గోన్నారు.