28 July, 2026 | 2:35 PM

విచారణకు డుమ్మా కొట్టిన హేమ

27-05-2024 10:28 PM

బెంగళూరు: ‘నేను వైరల్ ఫీవర్ బాధ పడుతున్నాను. విచారణకు హాజరు కాలేకపోతున్నాను. విచారణకు హాజరయ్యేందుకు మరింత సమయం కావాలి’ అని బెంగళూరులో రేవ్ పార్టీకి హాజరై, డ్రగ్స్ తీసుకున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న తెలుగు నటి హేమ అక్కడి క్రైం బ్రాంచ్ (సీసీబీ) లేఖ రాశారు. ఆమె సోమవారం విచారణకు హాజరు కావాలని సీసీబీ పోలీస్ అధికారులు సమన్లు ఇచ్చిన నేపథ్యంలో హేమ విచారణకు డుమ్మా కొట్టారు. దీంతో పోలీసులు మళ్లీ ఆమెకు సమన్లు పంపించే అవకాశం కనిపిస్తున్నది.