28 July, 2026 | 1:46 PM

Breaking News

రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కలిసిన కేటీఆర్   •   మహిళలకు ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ చేసిన ప్రభుత్వ విప్ వేముల వీరేశం   •   తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ అధికారంలోకి వస్తుంది   •   విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించాలి   •   నూతనంగా నిర్మించిన ఆసుపత్రిలో ప్రత్యేక వైద్య నిపుణులను కేటాయించండి   •   విద్యార్థులపై పోలీసుల లాఠీఛార్జి.. సెట్ విచారణకు సుప్రీం ఆదేశం   •   లోక్‌సభ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా   •   పావలా శ్యామల అంత్యక్రియల బాధ్యత తీసుకున్న 'మా' అసోసియేషన్   •   భాగ్యనగర్ తండా సబ్‌స్టేషన్ సమస్య పరిష్కరించాలి   •   విజయ క్రాంతి ఎఫెక్ట్... రైతు వేదిక పరిశుభ్రం   •  

రెండు వేల మంది సజీవ సమాధి

28-05-2024 12:05 AM

న్యూఢిల్లీ, మే 27: పపువా న్యూగినియాలో కొండచరియలు విరిగిపడిన దుర్ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతున్నది మందట వందమంది వరకు మరణించి ఉంటారని భావించగా, తాజాగా ఆ సంఖ్య రెండు వేలకు పెరిగింది. పపువా న్యూగినియా ప్రభుత్వం ఈ ప్రమాదంపై ఐక్యరాజ్యసమితికి వివరాలు వెల్లడించింది. మట్టికింద రెండువేల మంది వరకు సజీవ సమాధి అయి ఉంటారని తెలిపింది. ‘కొండచరియల కింద 2000 మందికిపైగా సజీవ సమాధి అయ్యారు. భవనాలు, పంటపొలాలన్నీ ధ్వంసమయ్యాయి. దేశ ఆర్థిక ప్రాణాధారానికి ఇది పెద్ద దెబ్బ’ అని పపువా న్యూగినియా అధికారులు ఐరాసకు తెలిపారు.