డీజేపై పాయింట్ బ్లాక్ రేంజ్‌లో కాల్పులు
27-05-2024 10:20 PM
జార్ఖండ్: జార్ఖండ్ రాజధాని రాంచీలో కాల్పులు కలకలం సృష్టించాయి. నగరంలోని ఓ బార్‌లో డీజేగా పనిచేస్తున్న సందీప్‌ను ఓ దుండగుడు పాయింట్ బ్లాక్ రేంజ్‌లో ఛాతీపై రైఫిల్‌తో కాల్చి చంపాడు. ఆదివారం రాత్రి బార్‌లో డీజే మ్యూజిక్ ప్లే చేస్తుండటంపై నలుగురు వ్యక్తులు అభ్యంతరం తెలిపారు. డీజే సందీప్‌తో పాటు బార్ యాజమాన్యంతో వారు వాగ్వాదానికి దిగి తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయారు. అనంతరం రాత్రి ఒంటిగంట ప్రాంతంలో తిరిగి వచ్చి సందీప్‌ను రైఫిల్‌తో ఛాతీపై కాల్చారు. అతన్ని దవాఖానకు తీసుకెళ్లినా ఫలితం దక్కలేదు. చికిత్స పొందుతూ మరణించాడు.






