27 February, 2026 | 3:13 AM

వేగంగా సినిమాలు చేయడానికి కారణం అదే..

27-02-2026 01:08 AM

శ్రీవిష్ణు హీరోగా నటిస్తున్న ‘విష్ణు విన్యా సం’. యదునాథ్ మారుతీరావు దర్శకత్వంలో శ్రీసుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుమంత్ నాయుడు నిర్మించిన ఈ చిత్రంలో నయన్ సారిక హీరోయిన్‌గా నటించింది. ఫిబ్రవరి 27న విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరో శ్రీవిష్ణు విలేకరులతో సినిమా విశేషాలను పంచుకున్నారు. 

మీరు జాతకాలను నమ్ముతారా..?! 

అన్నీ ఫాలో అవ్వను, కానీ మనం చిన్నప్పటి నుంచి అందరితోపాటు అలవాటు చేసుకున్న కొన్నిటిని అనుసరిస్తాను. వ్యక్తిగతంగా నాకైతే ఫలానా టైమ్.. ఫలానా నెంబర్.. అనే నమ్మకాలు లేవు. 

‘విష్ణు విన్యాసం’ ఎలా మొదలైంది?

డైరెక్టర్ మారుతి కథ చెప్పారు. నాకు చాలా నచ్చింది. అందరూ రిలేట్ అయ్యే కథ, చాలా మంచి క్యారెక్టర్. ఫ్యామిలీతో కలిసి హ్యాపీగా నవ్వుకోవచ్చు. కథ విన్న వెంటనే మొదలుపెట్టాం. 

మీ పాత్ర గురించి చెప్పండి..

ఇలాంటి పాత్ర చేయడం నాకు కొత్త. ఈ క్యారెక్టర్‌కు కొన్ని రూల్స్ ఉంటాయి. చాలా నమ్మకాలను ఫాలో అవుతుంటాడు. చాలా ఆసక్తిగా ఉంటుంది. -డైరెక్టర్ సినిమాను చాలా బాగా హ్యాండిల్ చేశాడు. చాలా క్లారిటీ ఉన్న డైరెక్టర్. ఎడిటింగ్ మీద కూడా చాలా మంచి గ్రిప్ ఉంది.  

మీ మార్క్ డైలాగ్స్ ఉంటాయా..? 

అన్నీ ఉంటాయి. కథ, క్యారెక్టర్ చాలా ఇంట్రెస్టింగ్‌గా సరదాగా అనిపిస్తాయి. ఇందులో ఇంకొంచెం డిఫరెంట్ టైమింగ్ చూస్తారు. మంచి సిచువేషన్ కామెడీ ఉంటుంది. ఇందులో వీరివీరి గుమ్మడి పండు అనే ఒక సీక్వెన్స్ ఉంది. ఆ ఎపిసోడ్‌కు థియేటర్ మొత్తం నవ్వులతో బ్లాస్ట్ అవుతుంది. ఇంటర్వెల్‌లో ఎవరూ ఊహించనంత వినోదాత్మకంగా ఉంటుంది. 

హీరోయిన్ పాత్ర చాలా డామినేటింగ్‌గా ఉంది కదా?! 

ఆ క్యారెక్టరైజేషన్‌ను ప్రేక్షకులు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. హీరోయిన్ డామినేషన్ సినిమాలో నా క్యారెక్టర్‌కు ప్రాబ్లం అవుతూ ఉంటుంది. అందులో నుంచి చాలా మంచి వినోదం పుడుతుంది. హీరోయిన్ క్యారెక్టర్ కాస్త అనుమానస్పదంగా ఉంటుంది. -నయన్ సారిక రెండు మూడు పేజీల సీన్ కూడా సింగిల్ టేక్‌లో చేసింది. తన నటన ఈ సినిమాలో చాలా ప్రత్యేకంగా ఉంటుంది.

కొత్త సినిమాలు గురించి?

‘కామ్రేడ్ కళ్యాణ్’ 80% షూటింగ్ పూర్తయింది. చాలా కొత్తగా ఉంటుంది. అలాగే రామ్ అబ్బరాజుతో ఓ సినిమా త్వరలో ప్రారంభం కాబోతుంది. సితారలో సన్నీ అనే ఒక కొత్త దర్శకుడితో ఓ సినిమా చేస్తున్నా. అది కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ‘సింగిల్’ సీక్వెల్ రాస్తున్నారు. 

మీరు చాలా వేగంగా సినిమాలు చేస్తున్నారు కదా?!

నేను అన్ని కూడా మన చుట్టూ ఉండే కథలే చేస్తున్నా. అని మనకు తెలిసిన పాత్రలే. మిడిల్ క్లాస్ స్టోరీ సెటప్. ఇలాంటి సినిమాలకు సంవత్సరాలు పట్టదు. సింపుల్‌గానే ఒక 60, 70 రోజుల్లో చేసుకోవచ్చు. అందుకే వేగంగా అవుతున్నాయని భావిస్తున్నా.