31 July, 2026 | 2:30 AM

సమృద్ధిగా వర్షాలు

31-07-2026 01:47 AM
  1. ప్రాజెక్టులకు జలకళ
  2. జూరాలకు పోటెత్తుతున్న వరద
  3. శ్రీరాంసాగర్‌లోకి 50 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఎల్లంపల్లి, కడెం, తాలిపేరు ప్రాజెక్టుల గేట్లు ఎత్తివేత
  4. మేడిగడ్డకు 2.21 లక్షల క్యూసెక్కుల వరద 
  5. భద్రాచలం వద్ద 28.50 అడుగులకు గోదావరి
  6. నేడు పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు

విజయక్రాంతి నెట్‌వర్క్, జూలై 30: రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత రెండు రోజులుగా ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వానల వల్ల గురువారం పలు జిల్లాల్లో వాగులు, వంకలు, నదులు ఉప్పొంగుతున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయా యి. గద్వాల జిల్లాలోని జూరాల జలాశయానికి వరద ప్రవాహం పోటెత్తుతోంది. ప్రాజె క్టు 10 గేట్లు ఎత్తి..81,000 క్యూసెక్కులను దిగువకు విడుదల చేశారు.

అలాగే 12 యూనిట్లతో విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. జూరాల నుంచి శ్రీశైలం జలాశయానికి కృష్ణ మ్మ పరవళ్లు తొక్కుతోంది. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో వాగులు ఉప్పొంగు తున్నాయి. తుమ్మిడిహట్టి వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది కుమ్రంభీం వట్టివాగు ప్రాజెక్టుల గేట్లను ఎత్తివేశారు. నిర్మల్ జిల్లాలో కడెం ప్రాజెక్ట్ 16 గేట్లు ఎత్తి, 1.69 లక్షల క్యూసెక్కులు గోదావరిలోకి వదిలారు. శ్రీరాంసాగర్‌లోకి 50 వేల క్యూసెక్కు ల వరద వచ్చిచేరుతోంది.

గడ్డన్నవాగు, స్వర్ణ ప్రాజెక్ట్, సదర్ మట్ ప్రాజెక్టులూ జలకళ సంతరించుకున్నాయి. భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. గురువా రం సాయంత్రం 5 గంట లకు 28.50 అడుగులకు మేర వరద ప్రవాహం నమోదైంది. పెద్దపల్లి జిల్లాలోని ఎల్లంపల్లి ప్రాజెక్టు 15 గేట్లను ఎత్తి, 4 లక్షల క్యూసె క్కులకు పైగా ని టిని దిగువకు వదిలారు. తాళిపేరు ప్రాజెక్టు 24 గేట్ల ద్వారా 84,376 క్యూసెక్కులకు పైగా విడుదల చేశారు. కాళేశ్వరం వద్ద గోదావరి ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. మెడిగడ్డకు 2.21 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండగా అదేస్థాయిలో నీటిని కిందికి వదిలారు.

జూరాల నుంచి శ్రీశైలంకు కృష్ణమ్మ పరవళ్లు

ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వ ర్షాల కారణంగా జూరాల ప్రాజెక్టుకు వరద ప్రవాహం పోటెత్తుతోంది. ప్రాజెక్టుకు ప్రస్తు తం 91,000 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదవుతుండగా, ప్రాజెక్టు అధికారులు 10 గేట్లను ఎత్తి 81,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జూరాల ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1,045 అడుగులు కాగా, ప్రస్తుతం 1,041.360 అడుగుల నీటిమట్టం నమోదైంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 9.657 టీఎంసీ లు కాగా, గురువారం సాయంత్రానికి 7.695 టీఎంసీలకు చేరింది.

అదే సమయంలో ఎగువ, దిగువ జూరాల జలవిద్యుత్ కేంద్రా ల్లో 12 యూనిట్లతో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. అలాగే ఎత్తిపోతల పథకాలకు కూడా నీటిని విడుదల చేస్తున్నారు. అలాగే శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. జూరాల 10 గేట్ల ద్వారా శ్రీశైలానికి వరద పోటెత్తుతోంది. గురువారం సాయంత్రానికి శ్రేశైలం జలాశయం నీటిమట్టం 252.150 మీటర్లు, 827.30 అడుగుల వద్ద 46.8234 టీఎంసీలుగా నమోదైంది. జూరాల నుంచి 38,225 క్యూ సెక్కులు, స్పిల్వే ద్వారా 47,196 క్యూసెక్కుల ప్రవాహం వచ్చి చేరుతోంది.

ఆదిలాబాద్‌లో భారీవర్షం

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నా యి. చెరువులు మత్తడి దుంకుతున్నాయి. ఆదిలాబాద్ సహా ఇంద్రవెల్లి, తలమడుగు మండలాల్లో శాంతాపూర్ వాగులు పొంగా యి.  దీంతో ఆయా ప్రాంతాలకు రాకపోక లు నిలిచిపోయాయి. ఆదిలాబాద్ జిల్లాలో కురుస్తున్న వర్షాలకు జలపాతాలన్నీ జలకళను సంతరించుకున్నా యి.

పెద్ద, చిన్న జల పాతాలు బాగానే ఉన్నప్పటికీ ప్రధానంగా నేరేడిగొండ మండలంలోని కుంటాల జలపాతం, బోథ్ మండలంలోని పొచ్చెర జల పాతం, ఇచ్చోడ మండలంలోని గాయత్రి గుండంతో పాటు బజార్ హత్నూర్ మండ లం కనకాయ గుండం తదితర జలపాతా లు నీటితో పరవళ్లు తొక్కుతున్నాయి. ఇచ్చోడ మండలంలోని ఎల్లమ్మగూడ నుంచి సిరిచేల్మా గ్రామానికి వచ్చే రహదారిపై ఉన్న లోలెవెల్ పైనుంచి వర్షపు నీరు ఉధృతంగా ప్రవహిస్తుండడం వల్ల రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో ఆయా గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

సమ్మక్క సారక్క బరాజ్ నుంచి నీటి విడుదల

గోదావరి నది ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు తోడుగా ములుగు జిల్లాలోని కన్నాయిగూడెం మండలంలోని తుపాకులగూడెం వద్ద సమ్మక్క సారక్క బ్యారేజ్ నుంచి అధికారులు దిగువ ప్రాంతానికి నీటిని వదిలారు. దీంతో గురువారం గోదావరి నదిలో వరద ఉధృతి మరింత పెరిగింది. మంగపేట మండలం కమలాపూ ర్ బిల్ట్ ఇంటెక్వెల్ వద్ద, మంగపేట పుష్కరఘాట్ వద్ద గోదావరి పరవళ్లు తొక్కుతోంది. వరద ఉధృతి గురువారం రాత్రి వరకు 12.06 మీటర్లకు చేరినట్లు సమాచారం. వర ద ఉధృతి కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, నదిలోకి వెళ్లడం, నది దాటే ప్రయత్నాలు చేయకూడదని అధికారులు హెచ్చరించారు. 

ఏజెన్సీలో ఉప్పొంగుతున్న వాగులు

కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో వాగులు, వంకలు ఉప్పొంగుతు న్నాయి. దీంతో రాకపోకలు నిలిచిపోయాయి. జనజీవనం స్తంభించిపోయింది. లింగాపూర్ మం డలంలోని పిట్టగూడ వంతెనపై వరద నీరు ప్రవహించడం తో దాదాపు 30 గ్రామాలకు రాకపోకలు స్తంభించిపోయాయి. ఎగువన ఉన్న మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో తుమ్మిడిహెట్టి వద్ద గోదావరి ఉప్పొంగి ప్రవహిస్తోంది.

ప్రాజెక్టులలో కి వరద నీరు చేరడంతో కుమురంభీం, వట్టివా గు ప్రాజెక్టుల స్పిల్‌వే గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. పెంచికలపేట మండలంలో బొలేరో వాహనం వరదల చిక్కుకున్నది. దీంతో ఎక్స్‌కవేటర్ వాహనం తో దాన్ని బయటికి తీశారు. ఆసిఫాబాద్ మండలం అప్పపల్లి రహదారిపై వాగు ఉప్పొంగుతోంది. దీంతో రాకపోకలు నిలిచిపో యాయి. భారీ వర్షాలకు కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం శ్రీనివాస్ నగర్ గ్రామంలో ఒక పెంకుటిల్లు కూలిపోయింది. దీంతో సుమారు లక్ష రూపాయల ఆస్తినష్టం జరిగింది.

నిర్మల్ జిల్లాలో కడెం ప్రాజెక్టు 16 గేట్ల ఎత్తివేత 

నిర్మల్ జిల్లాలో కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టులు, చెరువులకు నీరు వచ్చిచడంలో జలకళ సంతరించుకుంది. నిన్న మొన్నటి వరకు బోసిపోయిన ప్రాజెక్టులు చెరువులు 24 గంటల్లోనే వరద వచ్చి చేరడంతో రైతు లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో కడెం నారాయణ రెడ్డి ప్రాజెక్టుకు వరద పోటెత్తుతుంది. ప్రాజెక్టులోకి 1.29 లక్షల క్యూసెక్కులు వచ్చి చేరుతుంది. ప్రాజెక్టు పూ ర్తి నీటిమట్టం 700 అడుగులు కాగా 694 అడుగుల సామర్థ్యాన్ని నిలువ ఉంచుతూ 1.49 లక్షల క్యూసెక్కుల నీటిని 16 గేట్ల ద్వా రా గోదావరిలోకి వదులుతున్నారు. ప్రాజెక్ట్ కింద ఆయా గ్రామాల ప్రజలను అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీచేశారు.

గోదావరి నదిపై నిర్మించిన శ్రీరాంసాగర్‌లో కి 50 వేల క్యూసెక్కుల వరద వస్తుంది. ప్రాజెక్ట్ పూర్తి నీటిమట్టం 1091 అడుగులు (90టీఎంసీలు) కాగా గురువారం సాయంత్రానికి 1066 అడుగుల(17.818టీఎంసీలు)కు చేరింది. గడ్డన్న వాగు, స్వర్ణ ప్రాజెక్ట్, సదర్ మట్ ప్రాజెక్టులలోకి వరదరావడంతో జలకల సంతరించు కున్నాయి. వాగులు ఉప్పొంగి ప్రవహిస్తుండడంతో జిల్లాలోని ఎంబీ ఖానాపూర్ దస్తు రాబాద్ కుబీర్ సారంగాపూర్ మామడ తదితర మండలాల్లోని దాదాపు 30 పల్లెలకు రాకపోకలు నిలిచిపోయాయి. 

భద్రాచలం వద్ద ఉగ్రగోదావరి

పవిత్ర పుణ్యక్షేత్రమైన భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం గంట గంటకూ పెరుగుతున్నది. బుధవారం ఉదయం 8 గంట లకు 15.80 అడుగులకు చేరిన నీటిమట్టం గురువారం సాయంత్రం ఐదు గంటలకు 28.50 అడుగులకు చేరుకుంది. శుక్రవారం సాయంత్రానికి మొదటి ప్రమాద హెచ్చరిక 43 అడుగులకు సమీపంలోకి నీటిమట్టం చేరన్నట్లు తెలుస్తుంది. గురువారం సాయం త్రం 6 గంటలకు భద్రాచలానికి ఎగువన ఉన్న పేరూరు వద్ద గోదారి నీటిమట్టం 14. 720 మీటర్లలో ప్రవహిస్తూ, గంటగంటకూ పెరుగుతున్నది.

దీనికి తోడు భద్రాచలానికి ఎగువున ఉన్న తాళిపేరు ప్రాజెక్టు సైతం పొంగి ప్రవహిస్తోంది. భద్రాచలం వద్ద నీటిమట్టం 28 అడుగులకు చేరుకోవడంతో నది వద్ద గల స్నాన ఘట్టాలు వరద నీటిలో ము నిగాయి. జిల్లా కలెక్టర్ అంకిత్ అప్రమత్తమై అధికారులను వరద సహాయక కార్యక్రమంలో పాల్గొనటానికి సిద్ధం చేశారు. అంతే కాకుండా కొత్తగూడెం కలెక్టరేట్‌లో ఫ్లాట్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ఎవరైనా అత్యవసర సేవల కోసం ఫోన్‌నంబర్ 087 44241950కు ఫోన్ చేయాలని కోరారు.

కాళేశ్వరం వద్ద 2.21 లక్షల క్యూసెక్కుల వరద

ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం కాళే శ్వరం వద్ద గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ఉదయం సుమారు లక్ష క్యూసె క్కులుగా ఉన్న వరద ప్రవాహం సాయంత్రానికి గోదావరి నదులు కలిసి 2.21 లక్షల క్యూసెక్కులకు చేరింది.

ప్రస్తుతం నదిదో 7.55 మీటర్ల ఎత్తులో వరద ప్రవహిస్తోంది. ఈ వరద నీరు మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీకి చేరుతోంది. దీంతో బరాజ్‌కి 2.21 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైంది. అదే స్థాయిలో నీటిని దిగువకు విడుదల చేస్తూ అధికారులు 85 గేట్లను ఎత్తి ఉంచారు. మరో 24 గంటల్లో గోదావరి ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. దీంతో నదీతీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, నదిలోకి దిగకుండా, వరద ప్రవాహాలకు దూరంగా ఉండాలని సూచించారు.

తాళిపేరు 24 గేట్ల ఎత్తివేత

భద్రాద్రి కొత్తగూడం జిల్లాలోని చర్ల మండలంలోని తాళిపేరు మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టులోకి వరద భారీగా వచ్చి చేరుతోంది. ఎగువన ఛత్తీస్‌గఢ్‌తోపాటు తెలంగాణలో వర్షాలు కురుస్తుండంతో జలాశయానికి వరద పోటెత్తుతోంది. దీంతో అధికారులు 24 గేట్లను ఎత్తి 84,376 క్యూసెక్టుల వరదను గోదావరిలోకి విడుదల చేశారు. 13 గేట్లను రెండు అడుగల ఎత్తులో, 11 గేట్లను పూర్తిస్థాయిలో ఎత్తి, నీటిని విడుదల చేశారు. అలాగే పెద్దపల్లి జిల్లాలోని ఎల్లంపల్లి ప్రాజెక్టు 15 గేట్లను అధికారులు ఎత్తివేశారు. సుమారు 4లక్షల క్యూసెక్కులను దిగువకు విడుదల చేశారు. ఈ ప్రాజెక్టుకు భారీస్థాయిలో వరద కొనసాగుతోంది.

కామారెడ్డి జిల్లాలో ప్రాజెక్టులు, చెరువులకు జలకళ

గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు కామారెడ్డి జిల్లాలోని ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు, వాగులు జలకళను సంతరించుకున్నాయి. జిల్లాలోని నిజాంసాగర్ ప్రాజెక్టు, పోచారం ప్రాజెక్టు, కౌలాస్ నాలా ప్రాజెక్ట్‌లోకి వరద నీరు చేరుతోంది. నిజాంసాగర్ మండలంలోని నల్లవాగు పొం గిపొర్లుతోంది. కామారెడ్డి పెద్దచెరువులోకి వరద నీరు చేరుతుంది. గాంధారి, లింగంపేట, పాల్వంచ పెద్ద వాగు లు వరద నీటితో ప్రవహిస్తున్నాయి. చెరువులు, కుంటల్లో కీ వరద నీరు వచ్చి చేరుతుండడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పలు ప్రాంతాల్లో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. మరికొన్ని రోజులు వర్షాలు పడే అవకాశాలు ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరారు.

సిద్దిపేట జిల్లాలో మోస్తరు వర్షం 

సిద్దిపేట జిల్లాలో మోస్తరుగా వర్షం కురుస్తుంది. వరదలు పొంగిపొర్లడం లేకపోయి నా పంటలకు సరిపడే వర్షం మాత్రం పడుతోంది. కుంటలు, చెరువులు నిండితే బా గుంటుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. బుధవారం 39.5మీ.మీ కురవ గా, గురువారం 19.2మీ.మీ వర్షపాతం న మోదయింది. 

సిరిసిల్ల పెద్దబజార్‌లో భారీ వర్షం

గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా సిరిసిల్ల పట్టణంలోని పెద్ద బజార్‌లో భారీ వేపచెట్టు కూలిపోయిం ది. రోడ్డు పక్కన పార్క్ చేసి ఉన్న కారుపై నేరుగా చెట్టు పడింది. దీంతో కారు వెనుక భాగం, పైకప్పు దెబ్బతిన్నాయి. కారు లోపల ఉన్న వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయి. మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం దేవాపూర్ సల్పల వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నది.

నేడు భారీ వర్షాలు

  1. రెడ్, ఆరెంజ్, ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణశాఖ
  2. అప్రమత్తమైన ప్రభుత్వం, సహాయక బృందాలు సిద్ధం

తెలంగాణపై అల్పపీడన ప్రభావంతో హైదరాబాద్‌తోపాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆదిలాబాద్, కొమురంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది.

గంటకు 40 నుంచి 50 కి.మీ. వేగంతో గాలులు వీస్తాయని హెచ్చరించింది. నిజామాబాద్, రాజన్న సిరిసిల్లా, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, కామారెడ్డి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, మెదక్, సంగారెడ్డి, జనగామ్, హన్మకొండ, మహాబూబాబాద్, వరంగల్, వికారాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజిగిరి, సిద్ధిపేట, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. 30 నుంచి 40 కి.మీ. వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపింది.

శనివారం ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని, మిగతా ప్రాంతాల్లో సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. వాతావరణ శాఖ హెచ్చరికతో తెలంగాణ ప్రభుత్వం అలర్టయ్యింది. ఆకస్మిక వరదలు, లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచి పోయే ప్రమాదం ఉన్న నేపథ్యంలో సహాయక బృందాలను సిద్ధంగా ఉండాలని ఆదేశించింది. వాతావరణ శాఖ హెచ్చరికతో హైదరాబాద్‌లో పోలీసులు ముంద స్తు చర్యలను చేపట్టారు.