3 July, 2026 | 1:07 AM

ఓ చింగారి బాగుందే నువ్వొచ్చాక..

03-07-2026 12:00 AM

అశోక్ గల్లా, శ్రీగౌరీ ప్రియ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజాచిత్రం ‘VISA--వింటారా సరదాగా’. నూతన దర్శకుడు ఉద్భవ్ రఘు దర్శకత్వంలో రూపొందు తున్న ఈ చిత్రాన్ని నాగవంశీ, సాయిసౌజన్య నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో రాహుల్ విజయ్, శివాత్మిక రాజశేఖర్, సత్య, వైవా హర్ష, గుండు సుదర్శన్ ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.  తాజాగా ఈ సినిమా నుంచి చిత్రబృందం రెండో గీతం ‘చింగారి’ని విడుదల చేసింది.

‘నువ్వొచ్చాకే మైకంలో మనస్సంత తేలిందే.. నువ్వొచ్చాకే ప్రాయంలో మహత్తేంటో తెలిసిందే.. నువ్వొ చ్చాకే నా పయనంలో ప్రతి మలుపు మెరి సిందే.. నువ్వొచ్చాకే నా ప్రాణంలో మరో సగము మురిసిందే.. చెలియా నువు నా తోడుంటే లోకాన్నే గెలిచేస్తానే.. చింగారి నా చిరునవ్వుల ఓ చింగారి బాగుందే నువ్వొ చ్చాక..’ అంటూ సాగుతోందీ గీతం. విజయ్ బుల్గానిన్ సంగీతాన్ని సమకూర్చిన ఈ మెలోడీ గీతాన్ని సిద్ శ్రీరామ్, లిప్సిక ఆలపించగా, సనారే రాశారు.