25 April, 2026 | 12:54 PM

షూలో బంగారం దాచి.. తనిఖీల్లో చిక్కి

12-08-2024 12:25 AM
  1. రూ.కోటి విలువైన గోల్డ్ స్వాధీనం.. నిందితుడి అరెస్ట్ 
  2. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఘటన 
  3. తనిఖీల్లో గుర్తించిన డీఆర్‌ఐ అధికారులు

రాజేంద్రనగర్, ఆగస్టు 11: స్మగ్లర్లు బంగారాన్ని స్మగ్లింగ్ చేసేందుకు సరికొత్త మార్గాల ను ఎంచుకుంటున్నారు. తాజాగా ఓ ప్రయాణికుడు తన షూలో బంగారం రవాణా చే స్తూ ఎయిర్‌పోర్ట్‌లో పట్టుబడ్డాడు. డీఆర్‌ఐ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. దుబై నుంచి వచ్చిన ఫ్లుటై దిగి ఓ ప్రయాణికుడు ఎయిర్‌పోర్ట్ నుంచి బయటకు వస్తు న్నాడు. ప్రయాణికుడి తీరు అనుమానాస్పదంగా కనిపించడం తో డీఆర్‌ఐ అధికారులు అతడిని అడ్డుకున్నారు. ప్రయాణికుడి షూ ను సోదా చేయగా గొలుసు, బిస్కెట్ల రూపంలో ఉన్న కిలోకు పైగా బం గారం పట్టుబడిం ది. వెంటనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. పట్టు బడిన బంగారం విలువ రూ.కోటిపైగా ఉం టుందని ఎయిర్‌పోర్ట్ అధికారులు తెలిపారు.