BRICS Summit 2026: ఢిల్లీలో హై అలర్ట్

12-09-2026 | 10:30am

న్యూఢిల్లీ: జాతీయ రాజధానిలో 18వ బ్రిక్స్ (BRICS) నాయకుల శిఖరాగ్ర సమావేశం జరుగుతున్నందున హై అలర్ట్(High Alert) ప్రకటించారు. శనివారం నాడు నగరంలోని పలు కీలక మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు పోలీసులు తెలిపారు. దీనివల్ల మధ్య ఢిల్లీ, పరిసర ప్రాంతాల్లో ప్రయాణికులు మళ్లింపులు (diversions), ఆంక్షలను ఎదుర్కోవాల్సి రావచ్చు. ఢిల్లీ పోలీసుల(Delhi Police) ప్రకారం, ఉదయం 9:30 గంటల నుండి రాత్రి 9:30 గంటల వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయి. ముఖ్యంగా భారత్ మండపం(Bharat Mandapam), ప్రగతి మైదాన్ ప్రాంతాల చుట్టూ, అలాగే మధ్య ఢిల్లీని నగరంలోని ఇతర ప్రాంతాలతో అనుసంధానించే ప్రధాన మార్గాలలో వర్తిస్తాయి. రింగ్ రోడ్, మథుర రోడ్, భైరోన్ మార్గ్, తిలక్ మార్గ్, ఇండియా గేట్, సి-హెక్సాగన్ ప్రాంతం, సర్దార్ పటేల్ మార్గ్, పటేల్ రోడ్, NH-48, పరేడ్ రోడ్‌తో సహా అనేక ముఖ్యమైన రహదారులపై రోజులో వివిధ సమయాల్లో రాకపోకలు నియంత్రించబడతాయని పోలీసులు వెల్లడించారు.

బ్రిక్స్ సదస్సుకు దేశాధినేతల రాక.. భారీగా భద్రత ఏర్పాట్లు

బ్రిక్స్ సదస్సుకు పలు దేశాధినేతల రాకతో భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. 15 వేల మంది పోలీసులు, 200 కంపెనీల పారా మిలిటరీ బలగాలను(Paramilitary forces) మోహరించారు. ఎయిర్ పోర్టులు, హోటళ్లు, భారత్ మండలం మార్గాల్లో భద్రత కట్టుదిట్టం చేశారు. ఫేషియల్ రికగ్నిషన్, హైరెజల్యూషన్, 500కు పైగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. వీవీఐసీ కాన్వాయ్ లు వెళ్లే సమయంలో మాత్రమే ట్రాఫిక్ మళ్లిస్తున్నారు. బ్రిక్స్ సదస్సు(BRICS summit) సందర్బంగా ప్రత్యేక విధుల్లో 4,800 మంది ట్రాఫిక్ పోలీసులను మోహరించారు.


మరిన్ని వార్తలు