జాతీయ లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలి

12-09-2026 | 12:17pm

మణుగూరు, సెప్టెంబర్ 12,( విజయ క్రాంతి): ప్రజలు తమ కేసులను సత్వరంగా, సులభంగా, సామరస్యపూర్వకంగా పరిష్కరించుకునేందుకు జాతీయ లోక్ అదాలత్‌(National Lok Adalat)ను సద్వినియోగం చేసుకోవాలని మణుగూరు జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కంభపు సూరిరెడ్డి సూచించారు. మణుగూరు జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో జాతీయ లోక్ అదాలత్ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో న్యాయమూర్తి మాట్లాడుతూ..ఇరుపక్షాల అంగీకారంతో కేసులను రాజీ ద్వారా పరిష్కరించుకోవడం వల్ల సమయం, ఖర్చు ఆదా అవుతాయని తెలిపారు.

ప్రజలు కోర్టుల చుట్టూ తిరుగుతూ ఇబ్బందులు పడకుండా, పరస్పర అంగీకారంతో వివాదాలకు పరిష్కారం పొందే అవకాశం లోక్ అదాలత్ ద్వారా లభిస్తుందని పేర్కొన్నారు. చెక్ బౌన్స్ కేసులు, ప్రమాద పరిహార కేసులు, కుటుంబ వివాదాలు, రాజీ పడదగిన క్రిమినల్ కేసులను లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించుకోవచ్చని వివరించారు.కేసుల పరిష్కారానికి ఇరుపక్షాలు సహకరించి లోక్ అదాలత్ అవకాశాన్ని వినియోగించుకోవాలని న్యాయమూర్తి కోరారు.

ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు చంద్రకాని గురుకృష్ణ, లీగల్ ఎయిడ్ కౌన్సిల్ పద్మావతి, లోక్ అదాలత్ సభ్యురాలు సావిత్రి, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు