దోరకుంట గ్రామంలో హైమాస్ట్ లైట్లు ప్రారంభం
05-06-2026 06:42 PM
కోదాడ,(విజయక్రాంతి): దోరకుంట గ్రామంలో కాలనీ నందు శుక్రవారం హై మాస్ట్ లైట్లను సర్పంచ్ పాలకి సురేష్ ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే నలమాద పద్మావతి రెడ్డి సహకారంతో హై మాస్ట్ లైట్లను ఏర్పాటుచేయించినట్లు తెలిపారు. ఎమ్మెల్యే నలమాద పద్మావతి రెడ్డి కి గ్రామం తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఇట్టి కార్యక్రమంలో పంచాయతీ సెక్రటరీ వెంకటేశ్వర్లు,వార్డ్ మెంబర్లు పాలడుగు జాను, కోమ్మగాని పాపయ్య, కస్పరాజు సురేష్,ఒగ్గు నాగేంద్రబాబు ,షేక్ అహ్మద్, మొలుగూరి ఏసోబు, పాలడుగు సైదులు షేక్ షఫీ, వల్లెబోయిన రవి సోమపంగు గోపి ,ఒగ్గు రమేష్ పాల్గొన్నారు






