1 June, 2026 | 2:21 PM

Breaking News

బాధ్యతలు స్వీకరించిన డిప్యూటీ తహసిల్దార్..   •   డాక్టర్ కళ్యాణికి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగ కాంతారావు సన్మానం   •   విచారణకు హాజరైన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు యెన్నం, అనిరుధ్ రెడ్డి   •   నెల చివరి వరకు 30, 30(ఎ) పోలీసు యాక్ట్ అమలు   •   రామంతాపూర్‌లో RTC బస్సును ఢీకొట్టిన కారు   •   పిడుగుపాటుకు మృతి చెందిన కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే కోవ లక్ష్మీ   •   ఆయిల్ పామ్ నర్సరీలో నాణ్యమైన మొక్కలు సిద్ధం చేయాలి   •   అంగన్వాడి కేంద్రాల బలోపేతానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది: మంత్రి సీతక్క   •   BRS నేతల ముందస్తు అరెస్టులు.. అప్రజాస్వామికం   •   సీఎం జనజాతర సభకు మార్లవాయి గ్రామస్తుల భారీ తరలింపు   •  

ఆయిల్ పామ్ నర్సరీలో నాణ్యమైన మొక్కలు సిద్ధం చేయాలి

01-06-2026 01:41 PM
  1. జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష 
  2. ప్రభుత్వ భూముల వివరాలను సమగ్రంగా సిద్ధం చేయాలి
  3. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణ పనులు గడువులోగా పూర్తి చేయాలి
  4. సుల్తానాబాద్, ఎలిగేడు మండలాల్లో పర్యటించిన జిల్లా కలెక్టర్ 

సుల్తానాబాద్, (విజయక్రాంతి): ఆయిల్ పామ్ సాగు విస్తరణకు అవసరమైన నాణ్యమైన మొక్కలను సిద్ధం చేసి రైతులకుఅందుబాటులో ఉంచాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు.జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సోమవారం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని రెబ్బల్ దేవ్‌పల్లి ఆయిల్ పామ్ ప్రైమరీ, సెకండరీ నర్సరీలను, ఎలిగేడు మండలంలోని ర్యాకల్ దేవ్‌పల్లి ప్రభుత్వ భూములను, నిర్మాణానికి సిద్ధంగా ఉన్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ పనులను పరిశీలించారు.

ఈ సందర్భంగా రెబ్బల్ దేవ్‌పల్లి గ్రామంలో 48 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఆయిల్ పామ్ నర్సరీని పరిశీలించిన కలెక్టర్, రాబోయే ఖరీఫ్ సీజన్‌కు అవసరమైన మేర రైతులకు నాణ్యమైన మొక్కలను సరఫరా చేయాలని సూచించారు. గత సంవత్సరం 40 వేల మొక్కలను ఇతర జిల్లాలకు సరఫరా చేసినట్లు, వాటిని తిరిగి తీసుకువస్తున్నట్లు అధికారులు వివరించారు. ప్రస్తుతం 20 వేల మొక్కలు అందుబాటులో ఉన్నాయని తెలపగా, 1,000 ఎకరాలకు అవసరమైన మొక్కలను సిద్ధం చేయాలని కలెక్టర్ ఆదేశించారు.

అనంతరం ఎలిగేడు మండలం ర్యాకల్ దేవ్‌పల్లి పరిధిలోని ప్రభుత్వ భూములను పరిశీలించిన కలెక్టర్, మండలంలోని ప్రభుత్వ భూములకు సంబంధించిన సంపూర్ణ వివరాలను సిద్ధం చేసి సమర్పించాలనితహసీల్దార్‌ను ఆదేశించారు.యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణ పనులను పరిశీలించిన కలెక్టర్, ప్రభుత్వం నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా నాణ్యతతో పనులు చేపట్టాలని, నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు.ఈ పర్యటనలో హార్టికల్చర్ అధికారులు ఎస్. మహేష్, జ్యోతి, తిరుమల ఆయిల్ పామ్ ప్రైవేట్ లిమిటెడ్ సీఈఓ కేశ్ కళ్యాణ్‌కర్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.