1 June, 2026 | 2:21 PM

Breaking News

బాధ్యతలు స్వీకరించిన డిప్యూటీ తహసిల్దార్..   •   డాక్టర్ కళ్యాణికి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగ కాంతారావు సన్మానం   •   విచారణకు హాజరైన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు యెన్నం, అనిరుధ్ రెడ్డి   •   నెల చివరి వరకు 30, 30(ఎ) పోలీసు యాక్ట్ అమలు   •   రామంతాపూర్‌లో RTC బస్సును ఢీకొట్టిన కారు   •   పిడుగుపాటుకు మృతి చెందిన కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే కోవ లక్ష్మీ   •   ఆయిల్ పామ్ నర్సరీలో నాణ్యమైన మొక్కలు సిద్ధం చేయాలి   •   అంగన్వాడి కేంద్రాల బలోపేతానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది: మంత్రి సీతక్క   •   BRS నేతల ముందస్తు అరెస్టులు.. అప్రజాస్వామికం   •   సీఎం జనజాతర సభకు మార్లవాయి గ్రామస్తుల భారీ తరలింపు   •  

అంగన్వాడి కేంద్రాల బలోపేతానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది: మంత్రి సీతక్క

01-06-2026 01:39 PM

అసిఫాబాద్ (విజయక్రాంతి): చిన్నారులను సంపూర్ణ నైపుణ్యాలతో తీర్చిదిద్దడంలో అంగన్వాడి కేంద్రాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క(Minister Seethakka) అన్నారు. రెబ్బెన మండలం గోలేటి గ్రామంలోని అంగన్వాడి కేంద్రం-4లో సోమవారం నిర్వహించిన ‘అమ్మ మాట – అంగన్వాడి బాట’(Amma Mata - Anganwadi Bata) కార్యక్రమంలో జిల్లా ఇన్చార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు(Minister Jupally Krishna Rao),జిల్లా కలెక్టర్ కె. హరిత, సబ్ కలెక్టర్ శ్వేత శుక్లా, గ్రంథాలయ చైర్మన్ అనిల్ తో కలిసి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ ప్రభుత్వ అంగన్వాడి కేంద్రాలను ప్రైవేట్ పాఠశాలలకు ఏమాత్రం తీసిపోకుండా ఆధునిక సౌకర్యాలతో అభివృద్ధి చేస్తున్నామని మంత్రి తెలిపారు. నిరుపేద కుటుంబాలు అధిక ఫీజులు చెల్లించి ప్రైవేట్ పాఠశాలలకు పంపించకుండా తమ పిల్లలను అంగన్వాడి కేంద్రాల్లో చేర్పించాలని కోరారు.త్వరలో రాష్ట్రంలోని అన్ని అంగన్వాడి కేంద్రాలకు పక్కా భవనాలు నిర్మించనున్నట్లు ఆమె వెల్లడించారు. పిల్లలకు నాణ్యమైన పోషకాహారం అందించేందుకు ‘అమ్మ ముద్ద’ పేరుతో అల్పాహారం అందించే పైలట్ ప్రాజెక్టుకు ఆదిలాబాద్ జిల్లాను ఎంపిక చేసినట్లు తెలిపారు.

అంగన్వాడి కేంద్రాల్లో ఉన్న ఖాళీలను త్వరలో భర్తీ చేయనున్నామని, సిబ్బంది సమస్యల పరిష్కారంతో పాటు వారి వేతనాల పెంపుపై కూడా ప్రభుత్వం సానుకూలంగా ఆలోచిస్తున్నట్లు మంత్రి సీతక్క పేర్కొన్నారు.ఈ సందర్భంగా చిన్నారులకు అక్షరాభ్యాసం, అన్నప్రాసన కార్యక్రమాలు నిర్వహించి, విద్యార్థులకు ఏకరూప దుస్తులు, ధ్రువీకరణ పత్రాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో  ప్రజాప్రతినిధులు, అధికారులు, అంగన్వాడి సిబ్బంది, తల్లిదండ్రులు పాల్గొన్నారు.