పిడుగుపాటుకు మృతి చెందిన కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే కోవ లక్ష్మీ
01-06-2026 01:43 PM
ఆసిఫాబాద్ (విజయక్రాంతి): ఆసిఫాబాద్ మండలంలోని కౌటగూడ గ్రామంలో నిన్న పిడుగుపాటుకు మృతి చెందిన వ్యక్తి కుటుంబ సభ్యులను ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మీ పరామర్శించారు.ఈ సందర్భంగా మృతుడి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.కుటుంబానికి జరిగిన తీరని నష్టంపై విచారం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే బాధిత కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం బాధిత కుటుంబానికి తక్షణ ఆర్థిక సహాయం అందజేసి తన మానవత్వాన్ని చాటుకున్నారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.






