2 September, 2026 | 11:34 AM

పెంచిన ఇంధన ధరలను వెంటనే రద్దు చేయాలి

15-05-2026 | 05:49pm

అంధకార స్థితిలోకి ప్రజలను నెట్టివేయడం ప్రభుత్వాలకు తగదు

ఐఎఫ్టియు జాతీయ కార్యదర్శి షేక్షావలి డిమాండ్

జవహర్ నగర్,(విజయక్రాంతి): పెంచిన ఇంధన ధరలను వెంటనే రద్దు చేయాలని అంధకార స్థితిలోకి ప్రజలను నెట్టివేయడం ప్రభుత్వాలకు తగదని ఐఎఫ్టియు జాతీయ కార్యదర్శి షేక్షావలి డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా అమలులోకి వచ్చిన పెట్రో పెంపు ధరలను వెంటనే రద్దు చేయాలని ఐఎఫ్టియు జాతీయ కార్యదర్శి షేక్షావలి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ... 147 కోట్ల మంది భారత దేశ ప్రజలను అంధకారంలోకి నెట్టివేసే పెట్రోల్ డీజిల్ ధరల పెంపు దుర్మార్గమైన ప్రజా వ్యతిరేకమైన చర్య అని తెలిపారు.

పాశ్చాత్య దేశాలలో జరుగుతున్న యుద్ధం నేపథ్యంలో ఏర్పడిన సంక్షోభం వలన ఆయిల్ కంపెనీలు చేపట్టిన నిర్ణయంలో భాగమే పెట్రోల్ ధరల పెంపు అని కేంద్ర ప్రభుత్వం అనడాన్ని తీవ్రంగా ఖండించారు. అంతర్జాతీయ స్థాయిలో ఆయిల్ చమురు సంక్షోభంలో పడడానికి అమెరికా డోనాల్డ్ ట్రంప్ ఇజ్రాయిల్ నేతన్య లు కారణమని, ఐదు రాష్ట్రాల ఎన్నికలు అయిన వెంటనే ఇలాంటి ఆప్రజాస్వామ్యక చర్యల విధానాలతో దేశ ప్రజలను ఇంకా త్యాగాలకు సిద్ధపడాలని చెప్పడం శోచనియమన్నారు.

ఇప్పటికే ఏఐ టెక్నాలజీ వలన అనేక సాఫ్ట్వేర్ కంపెనీలలో పని చేస్తున్న ఉద్యోగులను ఇంటికి పంపిస్తున్నారని ఇంకా కొందరి ఉద్యోగస్తులకు వారి ఉద్యోగ భద్రత గాలిలో దీపంలా ఊగిసలాడుతుందన్నారు. ఆత్మహత్యలు అర్ధాకలి పస్తులు చాలీచాలని విద్య ఉద్యోగం ఉపాధి సౌకర్యాలు వేతనాలు లేక తల్లడిల్లి పోతున్న ప్రజానీకంపై పెట్రోల్ పెంపు మోయలేని పెను భారం అన్నారు. ఇప్పటికే పెరిగిన నిత్యవసరలతోపాటు ప్రజలు అల్లాడిపోతున్నారని దీనికి తోడు పెట్రో ధరలతో ఇతర వస్తువుల ధరలు అమాంతం పెరిగి ప్రజల కొనుగోలు శక్తిని దెబ్బతీస్తాయని గుర్తు చేశారు. వెంటనే కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాలని కోరారు.