15 May, 2026 | 7:03 PM

కడ్పల్ సొసైటీ సెంటర్లో 12 వేల బస్తాల వడ్ల కొనుగోలు

15-05-2026 05:46 PM

సిర్గాపూర్,(విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండల పరిధిలోని కడ్పల్ సొసైటీ కేంద్రంలో గత వారం క్రితం సొసైటీ ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలును ప్రారంభించారు. శుక్రవారం అగ్రికల్చర్ ఏవో కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ... ఇప్పటి వరకు 100 మంది రైతుల నుంచి 12130 వరి ధాన్యం బస్తాలు (485.6 క్వింటాలు) కొనుగోలు చేశామని సంబంధిత అగ్రికల్చర్ ఏవో హరికృష్ణ తెలిపారు. 70 మంది రైతులకు ట్యాబ్ ఎంట్రీ చేయగా 55 మంది రైతుల ఖాతాల్లో ప్రభుత్వ మద్దతు ధర జమా అయిందని చెప్పారు. మిగతా రైతుల బ్యాంకు ఖాతాల్లో ఈ రెండు రోజుల్లో జమవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సొసైటీ ఛైర్మెన్ ప్రతాప్ రెడ్డి, సీఈవో శ్రీకాంత్ రెడ్డి, రైతులు సంగమేష్, లక్ష్మ రెడ్డి, రాములు, భూమ్ రెడ్డి, జీవన్ రెడ్డి,  రైతులు పాల్గొన్నారు.