హిందువులారా మౌనం వీడండి
- సనాతన ధర్మ రక్షణ భాగస్వాములు కండి
- జర్నలిస్ట్ అమోఘ్ దేశపతి పిలుపు
హైదరాబాద్ సిటీ బ్యూరో/ఏప్రిల్ 20 (విజయక్రాంతి): హిందూ సమాజం మున్ముందు ఎదుర్కొంటున్న సవాళ్లను ప్రతి హిందువు గుర్తించాలని, తమ మౌనాన్ని వీడి హిందూ వ్యతిరేక శక్తులపై ఉద్యమించాలని జర్నలిస్ట్ అమోఘ్ దేశపతి పిలుపునిచ్ ఆచరు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) వంద ఏళ్ల ప్రస్థానాన్ని పురస్కరిం చుకుని సోమవారం నాగోల్ బండ్లగూడ ఫతుల్లాగూడలో నిర్వహించిన ‘హిందూ సమ్మేళనం’లో ఆయన మాట్లాడారు.
ప్రతి హిందువూ సనాతన ధర్మ రక్షణ, సామాజిక చైతన్య కార్యక్రమాల్లో ముందుండాలని సూచించారు. రాజకీయ పార్టీలు, కుహనా మేధావులు మైనార్టీలకు పరోక్షంగా సహకరిస్తూ హిందువులను అణచివేసే చర్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. లవ్ జిహాద్ విషయంలో అమ్మాయిలు, తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని సూచించా రు.
సీతకు లక్ష్మణుడు గీత గీసినట్లుగా, హిందువులు తమ రక్షణ కోసం తామే గీతలు గీసుకోవాల్సిన సమయం వచ్చిందని పిలుపునిచ్చారు. శనగల మానస కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో చీకొంటి రమ్యకృష్ణ (రచ్చ రాములమ్మ) తెలంగాణ హైకోర్టు సీనియర్ న్యా యవాది కరుణాసాగర్, మత్తుగూడ బస్తీ హిందూ సమ్మేళన సమితి నాయకులు కాలంశెట్టి హరిబాబు, కారంచేటి సంజయ్ శర్మ, గుంటి సత్యనారాయణ పాల్గొన్నారు.






