21 April, 2026 | 2:16 AM

ఫీజుల ఒత్తిడితో విద్యార్థుల ఆత్మహత్యలు

21-04-2026 01:13 AM
  1. ముఖ్యమంత్రి వెంటనే  స్పందించాలి
  2. సీఎం రేవంత్‌రెడ్డికి ఎంపీ ఆర్ కృష్ణయ్య లేఖ

ముషీరాబాద్, ఏప్రిల్ 20 (విజయక్రాంతి): ప్రభుత్వం ఫీజుల బకాయిలు చెల్లిం చకపోవడంతో కాలేజీ యాజమాన్యాలు విద్యార్థులను ఫీజులు కట్టాలని ఒత్తిడి తేవడంతో నగర శివారులోని శ్రీ ఇందు ఇంజనీరింగ్ కాలేజీ బీటెక్ విద్యార్థి ప్రణీత్ అవమానాన్ని భరించలేక ఆత్మహత్యకు పాల్పడ్డా రని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, ఎంపీ ఆర్. కృష్ణయ్య ఆరోపించారు.

ఇది అత్యంత దారుణమన్నారు. ఒకవైపు ప్రభు త్వం అసమర్ధత వలన బడ్జెట్ విడుదల చేయకపోవడంతో రాష్ట్రంలోని18 లక్షల మంది కాలేజీ విద్యార్థులు ఇదే రకమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, గత 30 నెలల కాంగ్రెస్ పాలనలో ఇప్పటివరకు 8 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారని,  ఇప్పటి కైనా ప్రభుత్వం వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించి బడ్జెట్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ సీఎంకు లేఖ రాసినట్లు ఎంపీ ఆర్. కృష్ణయ్య సోమవారం విద్యానగర్లోని బీసీ భవన్‌లో మీడియా సమావేశంలో వెల్లడించారు.

ఈ ఫీజు బకాయిలు చెల్లించకపోవడంతో విద్యార్థులు అష్ట కష్టాల పాలవుతున్నారన్నారు. ఈ ఫీజులు కట్టాలని కాలేజీ విద్యార్థులపై యాజమాన్యాలు ఒత్తిడి తెస్తున్నారని,  కోర్సు పూర్తయి న వారికి సర్టిఫికెట్లు ఇవ్వడం లేదన్నారు. పరీక్షా సమయంలో హాల్ టికెట్లు ఇవ్వడం లేదన్నారు. సర్టిఫికెట్లు లేక ఉద్యోగాలు వచ్చినవారికి అప్పులు చేసి ఫీజులు కట్టి సర్టిఫికెట్లు తీసుకుంటున్నారన్నారు. సర్టిఫికెట్లు తెసుకోలేక కొందరు ఉద్యోగాలు కోల్పోతున్నారన్నారు.

పీజీ కోర్సులలో సీట్లు పొందిన వారికి సర్టిఫికెట్లు ఇవ్వడం లేదన్నారు. దీనితో ఉన్నత చదువులు ఆపేస్తున్నారని మండిపడ్డారు . ఉద్యోగాలు పొం దిన వారు ఇతర దేశాలలో ఉద్యోగాలు వచ్చి న వారికి కూడా సర్టిఫికెట్లు ఇవ్వడం లేదన్నారు. దీనితో ఉద్యోగ అవకాశాలు కోల్పోతున్నారన్నారు.

గత18 సంవత్సరాలుగా కొనసాగుతున్న ఈ స్క్రీము వలన రెండు తెలుగు రాష్ట్రాలలో 2కోట్ల కుటుంబాలు బాగుపడ్డాయన్నారు. అడుగడుగున బీసీలకు అన్యా యం జరుగుతుంటే కాంగ్రెస్ పార్టీలో బీసీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు మౌనంగా ఉండడం న్యాయం కాదని అన్నా రు. రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.