మహిళలతో హెచ్‌ఎం అసభ్య ప్రవర్తన
చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల డిమాండ్
మునుగోడు, అక్టోబర్ 19: చండూరు ప్రభత్వ పాఠశాలో వంట చేసే మహిళలతో అసభ్యకరంగా ప్ర వర్తించిన హెడ్‌మాస్టర్‌ను సస్పెండ్ చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థి సంఘాల నాయకులు డి మాండ్ చేశారు. బాధితులతో కలసి డీఈవో భిక్షపతికి శనివారం వినతిపత్రం అందజేశారు.
తమకు ఎలాం టి నోటీసులు ఇవ్వకుండా విధుల నుంచి తొలగించి, ప్రైవేటు వ్యక్తులను నియమించుకుని తమపై దు ర్భాషలడుతూ, అసభ్యకరంగా ప్రవర్తించాడని చండూరుల పాఠశాలలో పనిచేస్తున్న రాజమ్మ, ధనమ్మ, సరిత ఆరోపించారు.
వంట చేసినందుకు ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బులను మాహిళా సంఘాలా ఖాతాలో జమచేయకుండా తన సొంత ఖాతాలో జమ చేసుకుని రూ.15,000 ఇచ్చేవాడని వాపోయారు. ఇదే విష యాన్ని అదనపు కలెక్టర్ పూర్ణచందర్ కలసి వివరించారు. డీఈవోను విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.






