5 March, 2026 | 10:55 AM

ఆనందోత్సాహాల మధ్య హోలీ

05-03-2026 12:00 AM

ఘట్ కేసర్, మార్చి 4 (విజయక్రాంతి) : సాంప్రదాయ బద్దమైన హోళీ పండుగను ఘట్ కేసర్ సర్కిల్ ప్రాంత ప్రజలు బుధవారం ఆనందోత్సాహాల మధ్య ఘనంగా జరుపుకున్నారు. రంగురంగుల కలయికలతో కూడిన రంగునీళ్లను ఒకరిపై మరొకరు చల్లుకుంటూ కేరింతలు కొడుతూ ప్రధాన వీధుల గుండా తిరుగుతూ హోళీని ఉత్సాహ భరితంగా జరుపుకున్నారు.

జాతి, మత, వర్గ విభేదాలు లేకుండా యువతీ, యువకులు, మహిళలు, చిన్నారులనే తారతమ్యం లేకుండా పండగను జరుపుకున్నారు. రోడ్లన్నీ రంగులు చల్లుకునే యువకులతో కళకళలాడాయి. గిరిజన మహిళలు ఇంటింటికీ తిరిగి పాటలు పాడుతూ, నృత్యాలు చేస్తూ చందాలు వసూలు చేయడం పలువురిని ఆకర్శించింది. హోళీ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ఘట్ కేసర్ సీఐ బాలస్వామి శాంతి భద్రతలపై నిఘా ఏర్పాటు చేశారు. ప్రజాప్రతినిధులు, నాయకులు, ప్రజలు ఒకరికి మరొకరు హోళీ శుభాకాంక్షలు తె లుపుకున్నారు.