30 July, 2026 | 10:01 AM

భారీ వర్షాల నేపథ్యంలో విద్యాసంస్థలకు సెలవు

30-07-2026 09:23 AM

జిల్లా కలెక్టర్ కె. హరిత ప్రకటన

ఆసిఫాబాద్ (విజయ క్రాంతి): జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో విద్యార్థుల భద్రత దృష్ట్యా ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలకు గురువారం సెలవు ప్రకటించినట్లు జిల్లా కలెక్టర్ కె. హరిత తెలిపారు.విద్యార్థుల తల్లిదండ్రులు ఈ విషయాన్ని గమనించి పిల్లలను ఇళ్ల వద్దనే ఉంచాలని సూచించారు. అలాగే అత్యవసర పరిస్థితులు లేకపోతే ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.ప్రజలకు తక్షణ సహాయం అందించేందుకు కలెక్టరేట్‌లో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో 8500844365 నంబర్‌ను సంప్రదించి సహాయం పొందాలని సూచించారు.