న్యాచురల్ ఆయిల్ సంపూర్ణ ఆరోగ్యానికి మంచిది
03-05-2025 02:02 AM
జుక్కల్ ఎమ్మెల్యే తోట
బిచ్కుంద, మే 02 (విజయంక్రాంతి): కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం కేoద్రం లో న్యాచురల్ ఆయిల్ సంపూర్ణ కేంద్రాన్ని శుక్రవారం ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... సంపూర్ణ ఆరోగ్యానికి ప్రతి ఒక్కరూ స్వచ్ఛమైన పదార్థాలను వినియోగించాలని సూచించారు. బహిరంగ మార్కెట్లో వినియోగిస్తున్న పదార్థాల్లో కల్తీ ఉంటుందన్నారు.
ముఖ్యంగా ఆయిల్ వంటి అంశాల్లో నాణ్యతను నిర్ధారించుకోవాలని చెప్పారు. న్యాచురల్ ఆయిల్ కేంద్రం ప్రజలకు శుద్ధమైన నూనెను అందించేందుకు ప్రారంభించామని, ప్రజలు ఇలాంటి కేంద్రాలను వినియోగించి తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.






