అగ్నికి ఆహుతైన పేద కుటుంబం ఆశలు
04-08-2026 12:00 AM
రూ.3 లక్షల నగదు, కీలక పత్రాలు దగ్ధం
గద్వాల టౌన్, ఆగస్టు 3: గద్వాల పట్టణంలోని పిల్లిగుండ్ల కాలనీలో సోమవారం జరిగిన అగ్నిప్రమాదంలో బుడగ జంగాల గోపాల్కు చెందిన గుడిసె పూర్తిగా దగ్ధమైంది. కుటుంబ సభ్యులు బయటకు వెళ్లిన కొద్దిసేపటికే మంటలు చెలరేగడంతో ఇంట్లో ఉన్న రూ.3 లక్షల నగదు, బంగారు, వెండి ఆభరణాలు, స్థల పత్రాలు, విద్యా సర్టిఫికెట్లు, ఇతర సామగ్రి కాలిబూడిదయ్యాయి. స్థానికులు మంటలను ఆర్పేందుకు ప్రయత్నించినప్పటికీ అప్పటికే గుడిసె పూర్తిగా కాలిపోయింది. ఈ ఘటనతో సర్వం కోల్పోయిన బాధిత కుటుంబం ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు, దాతలు ఆదుకోవాలని వేడుకుంది.






