4 August, 2026 | 1:51 AM

స్వామివారి ఆలయంలో శాస్త్రోక్తంగా నిత్య పూజలు

04-08-2026 12:00 AM

వైభవంగా స్వామివారి నిత్య కళ్యాణం

యాదగిరిగుట్ట, ఆగస్టు 3 : యాదగిరిగుట్ట దేవస్థానంలో సోమవారం నిత్య పూజలు వైభవంగా నిర్వహించారు. శ్రీ స్వామి వారి ఆలయంలో ఉదయం సుప్రభాత సేవ తో గర్భగుడిలో కొలువు దీరిన స్వయంభులను సువర్ణ ప్రతిష్ట మూర్తులను వేదమం త్రోచరణలు, మంగళ వాయిద్యాల నడుమ పంచామృతాలతో అభిషేకించి తులసీదళాలతో అర్పించారు.

ప్రాకారమంటపంలో  నృసింహ హోమం, నిత్య కళ్యాణంను వైభవంగా నిర్వహించారు. సాయంత్రం వెండి జోడు సేవ స్వామివారు తిరువీధులలో ఊ రేగారు. శ్రీ పర్వత వర్ధిని రామలింగేశ్వర ఆలయంలో సోమవారం స్వయంభు  లింగం, స్పటిక లింగంకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు దర్శించుకున్నారు.