6 July, 2026 | 1:19 AM

సింధూపైనే ఆశలు..

21-05-2024 12:37 AM

 మలేషియా మాస్టర్స్

కౌలలంపూర్: గత కొంత కాలంగా స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్న భారత ఏస్ షట్లర్ పీవీ సింధు మలేషియా మాస్టర్స్ టోర్నీలో బరిలోకి దిగనుంది. ప్రతిష్ఠాత్మక పారిస్ ఒలింపిక్స్‌కు ముందు టోర్నీలో విజయం సాధించి ఆత్మవిశ్వాసం కూడగట్టుకోవాలని సింధు భావిస్తోంది. ఇటీవలే జరిగిన థామస్, ఉబెర్ కప్, థాయ్‌లాండ్ ఓపెన్ టోర్నీలకు దూరంగా ఉన్న సింధూ మాలేషియా మాస్టర్స్‌లో బరిలోకి దిగనుండడంతో ఎలాంటి ప్రదర్శన చేస్తుందన్నది ఆసక్తికరం.

ఇక మోకాలి గాయం నుంచి కోలుకున్న అనంతరం సింధు పూర్వ వైభవాన్ని అందుకోలేకపోయింది. గాయం నుంచి కోలుకున్న తర్వాత ఆడిన ఆరు టోర్నీల్లో రెండుసార్లు మాత్రమే క్వార్టర్స్‌కు చేరుకోగలిగింది. ఇక 2022లో  సింగపూర్ ఓపెన్ రూపంలో సింధూ చివరి మాస్టర్స్ టైటిల్‌ను సాధించింది. సింధూతో పాటు అస్మిత చలిహా, ఆకర్షి కశ్యప్, మాళవిక బన్సోద్‌లు సింగిల్స్‌లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. పురుషులు సింగిల్స్‌లో కిరణ్ జార్జ్ ఒక్కడే బరిలోకి దిగనున్నాడు.