భారత్‌కు మళ్లీ ఇంధన సెగ!
హర్మూజ్ జలసంధి(Strait of Hormuz) ప్రాంతంలో చమురు రవాణాకు అంతరాయం ఏర్పడటం, మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న ఉద్రిక్తతల కారణంగా ప్రపంచ ఇంధన మార్కెట్‌పై ఒత్తిడి పెరుగుతోంది. అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్ సహా పలు దేశాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు గణనీయంగా పెరిగినట్లు సమాచారం.ఈ పరిణామాల ప్రభావం భారత్‌పైనా పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు మరింత పెరిగితే దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలపై ఒత్తిడి పెరగవచ్చని వారు పేర్కొంటున్నారు.
ఇంధన ధరలు పెరిగితే రవాణా వ్యయాలు కూడా పెరిగే అవకాశం ఉంది. దాని ప్రభావంతో నిత్యావసర వస్తువులు, ఆహార పదార్థాలు, ఇతర వినియోగ వస్తువుల ధరలపై కూడా ఒత్తిడి ఏర్పడవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. హర్మూజ్ జలసంధిలో పరిస్థితులు ఎంతకాలం కొనసాగుతాయి, అంతర్జాతీయ ముడిచమురు ధరలు ఏ స్థాయిలో స్థిరపడతాయి అన్నదానిపైనే భారత్‌పై ప్రభావం తీవ్రత ఆధారపడి ఉంటుంది.