హాస్టల్ విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలి
భీమదేవరపల్లి, సెప్టెంబర్ 4 (విజయక్రాంతి): భారత ఐక్య విద్యార్థి ఫెడరేషన్(United Student Federation of India) యుఎస్‌ఎఫ్‌ఐ హనుమకొండ జిల్లా కమిటీ(USFI Hanumakonda District Committee) ఆధ్వర్యంలో భీమదేవరపల్లి మండలంలోని హాస్టలను(Hostel) సందర్శించడం జరిగింది . అందులో భాగంగా వంగరలో ఉన్న ఎస్సీ బాయ్స్ హాస్టల్() సందర్శించి విద్యార్థులతో మాట్లాడడం జరిగింది.SC Boys Hostel
ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు ఆకుల మనోజ్(Akula Manoj) మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు(State government elections) ముందు అనేక హామీలు ఇచ్చి విద్య రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేస్తుందని ప్రధానంగా సంక్షేమ హాస్టల్లో పూర్తిస్థాయిలో వర్కర్లు లేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టల్లో ప్రధానంగా పూర్తిస్థాయిగా వర్కర్లు లేకపోవడం అదే విధంగా నైట్ డ్యూటీ వాచ్మెన్ లేకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.
జిల్లా అధికారులు వెంటనే స్పందించి విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని కోరారు. సంక్షేమ హాస్టల్లో వంగరలో ప్రహరీ గోడ లేక చెరువు పక్కనే ఉండడం వల్ల బయట నుండి విషపురుగులు వస్తున్నాయని కిటికీలకు దోమతెరలు మరియు క్రీడా సామాగ్రి లేకపోవడం వల్ల విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.
విద్యార్థులకు రావలసిన మిస్కాస్మోటిక్ బిల్లులు గత మూడు నెలలుగా పెండింగ్ లో ఉన్నాయని వెంటనే విడుదల చేయాలని అన్నారు. జిల్లావ్యాప్తంగా అధికారులు రాత్రి వేళల్లో బస చేసి విద్యార్థుల సమస్యలపై అధ్యయనం చేసి సమస్యల పరిష్కారం దిశగా కృషి చేయాలని అన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ హాస్టల సమస్యలు పరిష్కరించాలని లేనియెడల పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు రాజు మహేష్ కిరణ్ తదితరులు పాల్గొన్నారు.






