calender_icon.png 11 September, 2025 | 11:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సమీప పాఠశాలల ఎన్‌ఓసీ లేకుండా ప్రైవేట్ పాఠశాల ఎలా నడుస్తుంది?

08-09-2025 12:00:00 AM

  1. తామెవ్వరం ఎన్‌ఓసీ ఇవ్వలేదు 

సమీప పాఠశాలల ప్రధానోపాధ్యాయులు

భద్రాద్రి కొత్తగూడెం, సెప్టెంబర్ 7, (విజయక్రాంతి):సమీప పాఠశాలల అనుమతి లేకుండా ప్రైవేట్ పాఠశాల నిర్వహించడం ని బంధనలకు విరుద్ధం.పాఠశాల ఏర్పాటు చేయాలంటే సమీపంలోని 3 కిలోమీటర్ల వి స్తీర్ణంలో గల ప్రభుత్వ పాఠశాలల నుంచి ఎన్‌ఓసి తప్పనిసరిగా అనుమతి కొరకు స మర్పించాల్సి ఉంటుంది. ప్రభుత్వ పాఠశాలల ఎన్‌ఓసీ లేకుండా పాల్వంచ పట్టణ పరి ధిలోని నెహ్రూ నగర్ లో గత మూడు సంవత్సరాలుగా నారాయణ ఇంగ్లీష్ మీడియం ఉన్నత పాఠశాల కొనసాగుతోంది.

ఆ పాఠశాలకు అతి సమీపంలోనే రాతి చెరువు బం జర ప్రాథమికోన్నత పాఠశాల, వికలాంగుల కాలనీ ప్రాథమికోనత పాఠశాల, గిరిజన ప్ర భుత్వ ప్రాథమిక పాఠశాల లున్నాయి. నారాయణ పాఠశాల అనుమతి పొందాలంటే స మీపంలో గల ఈ పాఠశాలల నుంచి ఎన్‌ఓసి తప్పనిసరి గా సమర్పించాల్సి ఉంది.

పాఠశాలకు అనుమతులు ఉన్నాయంటూ గత ఏడాది నుంచి మండల విద్యాధికారి, పాఠశాల యాజమాన్యం మౌఖికంగా చెపుతున్నారే తప్ప భైర్గతం చేయడం చేయకపోవ డంలో అంతర్యం ఏమిటో వారికే తెలియా లి. అధికారులు తెలిపినట్టు పాఠశాలకు అ నుమతులు ఉన్నప్పటికీ, ప్రారంభం సమయంలో తప్పనిసరిగా సమీప ప్రభుత్వ పా ఠశాలల ఎన్‌ఓసి పొంది ఉండాల్సి నా నిబంధన అతిక్రమించినట్టు తేటతెల్లమవుతుంది.

ఈ పాఠశాల నిర్వహణ లో అధికారులకు పెద్ద మొత్తంలో డబ్బులు చేతులు మారినట్లు ఆరోపణలు కూడా ఉన్నాయి. ఒకవైపు ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి అనేక సంస్కరణలు చేపడుతున్న, క్షేత్ర స్థాయిలో మండల విద్యాధికారులు ఆమ్యాన్యాలకు తలకి నిబంధనలను తుంగలో తొ క్కుతున్నారని, దొడ్డి దారిన పాఠశాలల అనుమతులకు సిఫారసు చేస్తున్నారని విమర్శలు వెలవడుతున్నాయి.

జిల్లా కలెక్టర్, జిల్లా విద్యాధికారి నారాయణ పాఠశాల అనుమతులపై ఉన్న సందేహాలపై, సమీప పాఠశా లల ఎన్ ఓ సి లపై సమగ్ర విచారణ నిర్వహించాలని, విద్యా వ్యాపారాన్ని చేస్తున్న వి ద్యా సంస్థలపై చర్యలు చేసుకోవాలని విద్యార్థి సంఘాలు, విద్యార్థుల తల్లిదండ్రు లు డిమాండ్ చేస్తున్నారు.పట్టణ పరిధిలోని నారాయణ పాఠశాల అనుమతులపై అధికారులునెల రోజులుగా స్పష్టత ఇవ్వకపో వడం పై అనేక అనుమానాలు దారితీస్తున్నాయి.

ఎన్‌ఓసి ఇవ్వలేదు 

పాఠశాలకు అతి సమీపంలో నిర్వహించబడుతున్న నారాయణ ఇంగ్లీష్ మీడియం ఉన్నత పాఠశాల ప్రారంభం సమయంలో తమ పాఠశాల నుంచి ఎ లాంటి ఎన్‌ఓసి ఇవ్వలేదని వికలాంగుల కాలనీ ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు రామకృష్ణ స్పష్టం చేశారు.

తమ నెవరు ఎన్వోసీ అడగలేదని, ఎవరికి ఎన్వోసీ ఇవ్వలేదని, ప్రైవేటు పాఠశాల ప్రారంభ సమయం లో సమీప ప్రభుత్వ పాఠశాలల నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ అవసరమంటున్నదన్న విషయం తమకే తెలియదన్నారు.

రామకృష్ణ (ప్రధానోపాధ్యాయులు)