08-09-2025 12:00:00 AM
సీపీఐ జిల్లా కార్యదర్శి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం
నల్లగొండటౌన్, సెప్టెంబర్ 7 (విజయక్రాంతి) : భూమికోసం, భుక్తి కోసం దొరలు, భూసాముల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా మట్టి మనుషులు చేసిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం హిందూ ముస్లింల మధ్య జరిగిన పోరాటంగా బిజెపి చరిత్రను వక్రీకరించే ప్రయత్నాన్ని ప్రజలు తిప్పికొట్టాలని సిపిఐ జిల్లా కార్యదర్శి,ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం పిలుపునిచ్చారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని సిపిఐ కార్యాలయంలో మాగ్ధుమ్ భవనంలో నిర్వహించిన జిల్లా కార్యవర్గ సమావేశంలో మాట్లాడారు.
తెలంగాణ ప్రాంతంలో నైజాం కు వ్యతిరేకంగా సాగిన సాయుధ పోరాటం తెలంగాణ అగ్ని కణంగా మారిందన్నారు. పోరాటంలో నాలుగువేల అమరవీరుల రక్త తర్పణంతో చేయడం జరిగిందన్నారు.అదేవిదంగా దొరలు,భూస్వాముల లక్షలాది ఎకరాల భూమిని పేదలకు పంపిన చరిత్ర భారత కమ్యూనిస్టు పార్టీ కె దక్కిందన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం మట్టి మనుషులు చేసిన మహోత్తరమైన పోరాటాన్ని అవమానపరిచి సాయుధ పోరాట యోధులకు రావలసిన పింఛన్లను ఎత్తివేసిన హీనమైన చరిత్ర ఉందని విమర్శించారు.
సిపిఐ మాజీ ప్రధాన కార్యదర్శి, మాజీ పార్లమెంట్ సభ్యులు కామ్రేడ్ సురవరం సుధాకర రెడ్డిసంస్మరణ సభ ఈనెల 10న నల్లగొండ పట్టణంలోని దేవరకొండ రోడ్ లోగలజిఎల్ గార్డెన్ లోనిర్వహించడంజరుగుతుందన్నారు.ఈ సంస్మర సభలో అన్ని వర్గాల ప్రజలు పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు.
సమావేశానికి జిల్లా కార్యవర్గ సభ్యులు నల్పరాజు రామలింగయ్య అధ్యక్షత వహించగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పల్లా నర్సింహా రెడ్డి,జిల్లా సహాయ కార్యదర్శిలు పల్లా దేవేందర్ రెడ్డి, లోడింగి శ్రవణ్ కుమార్, కార్యవర్గ సభ్యులు పబ్బు వీరాస్వామి,గురిజ రామచంద్రం,బంటు వెంకటేశ్వర్లు బోల్గురినరసింహ,తిర్పారి వెంకటేశ్వర్లు, ఆర్ అంజ చారి, తూము బుచ్చి రెడ్డి లు పాల్గొన్నారు.