7 July, 2026 | 8:09 PM

నాగిరెడ్డిపేట్ గవర్నమెంట్ హాస్పిటల్లో డెలివరీల సంఖ్య పెంచాలి

07-07-2026 07:23 PM

నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య వైద్య కేంద్రంలో నిర్వహించిన ఆశ డే కార్యక్రమానికి ఎల్లారెడ్డి డిప్యూటీ డిఎంహెచ్వో నర్సింగ్ చాహన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎల్లారెడ్డి డిప్యూటీ డిఎంహెచ్వో నర్సింగ్ చౌహన్ మాట్లాడుతూ... నాగిరెడ్డిపేట్ గవర్నమెంట్ హాస్పిటల్లో డెలివరీల సంఖ్య పెంచాలని, నార్మల్ డెలివరీల ప్రసవల సంఖ్య కూడా పెంచాలన్నారు. వర్షాకాలం సందర్భంగా సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ఫీవర్ సర్వే నిర్వహించి తగు జాగ్రత్తలు, మందులు అందేలా చూడాలని ఆశ వర్కర్లకు, గవర్నమెంట్ ఆసుపత్రి సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక డాక్టర్ సృజన్ కుమార్, సిహెచ్ఓ ఠాగూర్, సూపర్వైజర్ సునంద, సుభాషిని, అనిల్, డేవిడ్, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు పాల్గొన్నారు.