ప్రభుత్వ భూమి ప్రైవేట్‌గా ఎలా మారింది?
బీఆర్‌ఎస్ నేత గజ్జల నగేష్
సికింద్రాబాద్, జూన్ 12 (విజయక్రాంతి): రూ.400 కోట్ల విలువైన ప్రభుత్వ భూమి కబ్జా అయ్యిందని, ప్రభుత్వ భూములను ప్రయివేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టడం వెనకాల ఎవరి పాత్ర ఉందో ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉన్నదని బీఆర్‌ఎస్ నేత గజ్జెల నాగేష్ అన్నారు. బీఆర్‌ఎస్ పాలనలో భూమిని కాపాడితే కాంగ్రెస్ పాలనలో ఆయా భూములు అన్యాక్రాంతం అయ్యాయని ఆరోపించారు. గతంలో మల్కాజిగిరి ఎంపీగా పనిచేసిన రేవంత్‌రెడ్డి నేడు సీఎం పదవి చేపట్టిన వెంటనే ఈ భూమి ప్రయివేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లిందన్నారు.
బోయిన్ పల్లిలో 57,157/1సర్వే నెంబర్లు మార్చి కొద్ది మందికి కట్టబెట్టారని ఆరోపించారు. గతంలో ప్రభుత్వ భూమి వైపు కన్నెత్తకుండా కేసీఆర్ పాలన సాగిందని గుర్తు చేశారు. కానీ రెండేళ్ల కాంగ్రేస్ పాలనలో 8 ఎకరాల భూమి చేతులు మారిందన్నారు. అన్ని వివరాలు తమ వద్ద ఉన్నావని వాటిని బయట పెడుతామన్నారు. కబ్జాలకు చెక్ పెట్టి ప్రభుత్వ భూమి ప్రజలకు చెందేలా చూడాలని లేదంటే పోరాటం చేస్తామని హెచ్చరించారు.






