28 July, 2026 | 6:40 PM

మూతపడ్డ రైస్ మిల్లులకు ధాన్యం ఎలా కేటాయిస్తున్నారు

28-07-2026 06:08 PM

అధికారుల తీరుపై మండిపడ్డ గొట్టే ముక్కుల సురేష్ రెడ్డి

సుల్తానాబాద్,(విజయక్రాంతి): అధికారులు అక్రమాలకు పాల్పడి రాష్ట్రంలోని పలుచోట్ల  మూతపడ్డ రైస్ మిల్లులకు ధాన్యం ఎలా కేటాయిస్తున్నారని ప్రశ్నిస్తూ అధికారుల తీరుపై బిజెపి రాష్ట్ర నాయకులు  గొట్టేముక్కుల సురేష్ రెడ్డి మండిపడ్డారు, మంగళవారం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణం లోని ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో  ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అధికారుల అవినీతి పెరిగిపోతుందని, రైతులకు న్యాయం జరిగేంత వరకు పోరాడుతామని, బకాసుర్లను వదిలి పెట్టేది లేదని ఆయన మండిపడ్డారు.

గత కొన్ని సంవత్సరాలుగా ధాన్యం కొనుగోలులో అవకతవకలు  జరుగుతున్నాయని, రైతులు కష్టపడి ధాన్యం పండిస్తుంటే సివిల్ సప్లై అధికారులు అక్రమాలకు పాల్పడుతున్నారని, ఈ ఏడాది రెండు పంటల కు సంబంధించి 700 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ఆరోపించారు, ఇంత జరుగుతున్నా ప్రజాప్రతినిధులు, అధికారుల కు చీమకుట్టినట్టు కూడా లేదు అన్నారు,  పెద్దపల్లి జిల్లాతో పాటు పలు జిల్లాల్లో మూతపడ్డ రైస్ మిల్లులకు సిఎంఆర్ కేటాయించడం ఎంతవరకు సమంజసం అని ఆయన ప్రశ్నించారు, ఇంత దౌర్భాగ్య పరిస్థితి ఎప్పుడూ చూడలేదని సురేష్ రెడ్డి అన్నారు,