28 July, 2026 | 6:40 PM

మాజీ మంత్రి జైపాల్ రెడ్డికి ఘన నివాళి

28-07-2026 06:06 PM

వెల్దండ: రాజ నీతిజ్ఞుడు ఉత్తమ పార్లమెంటేరియన్ గా దేశానికి ఎనలేని సేవ చేసిన కేంద్రమంత్రి  జైపాల్ రెడ్డి యువతకు స్ఫూర్తి ప్రదాత అని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. దివంగత సూదిని జైపాల్ రెడ్డి 7వ వర్ధంతిని మంగళవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల పరిధిలోని కొట్ర ప్రధాన కూడలిలో గల జైపాల్ రెడ్డి విగ్రహానికి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు పూలమాలలు వేసి నివాళి అర్పించి ఆయన చేసిన సేవలను కొనియాడారు.