26 March, 2026 | 2:50 AM

సివిల్ సర్వీసెస్‌కు ఎలా సిద్ధమవ్వాలి?

26-03-2026 12:00 AM
  1. ఏఆర్‌కే రిఫ్లెక్షన్స్ ఐఏఎస్ అకాడమీ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు
  2. ఐఐఎంసీ కళాశాలలో నిర్వహణ    

హైదరాబాద్, మార్చి 25(విజయక్రాంతి): హైదరాబాద్‌లోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ అండ్ కామర్స్(ఐఐఎంసీ) కళాశాలలో బుధవారం సివిల్ సర్వీసెస్‌కు సిద్ధం కావడం ఎలా? అనే అంశంపై ఏఆర్‌కే రిఫ్లెక్షన్స్ ఐఏఎస్ అకాడమీ ఆధ్వర్యంలో    సెమినార్ నిర్వహించారు. ఈ కార్యక్రమం ఏఆర్‌కే సంస్థ చైర్మన్ గుమ్మి రామ్‌రెడ్డి మార్గద ర్శకత్వంలో జరిగింది.

ఈ సందర్భంగా అకాడమీ డైరెక్టర్ మధుసూదన్ రెడ్డి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షకు సమర్థంగా ఎలా సిద్ధం కావాలో డిగ్రీ విద్యార్థులకు  విలువైన సూచనలు అం దించారు. ఒక సివిల్ సర్వెంట్ శిక్షణ కోసం ప్రభుత్వం సుమారు రూ.70 లక్షలు ఖర్చు చేస్తుందని పేర్కొంటూ, ఆ బాధ్యతను నిర్వహించడం ఎంతో గొప్ప అనుభూతి అన్నారు.

ఐఏఎస్, ఐపీఎస్ మాత్రమే కాకుండా యూపీఎస్సీ పరిధిలో సుమారు 26 రకాల సేవలు ఉన్నాయని, ఇవన్నీ విద్యార్థులకు విశాలమైన ఉద్యోగావకాశాలను కల్పిస్తాయని వివరించా రు. సామాజిక-ఆర్థిక పరిస్థితులు వ్యక్తుల జీవితాలను ఎలా ప్రభావితం చేస్తాయో వివరిస్తూ, సీతగీత అనే ఇద్దరు విద్యార్థినులు ఉదాహరణను ఆయన ప్రస్తావించారు.

ఇద్దరూ చదువు లో ప్రతిభ కలిగి ఉన్నప్పటికీ, ఆర్థిక ఇబ్బందుల కారణంగా సీత ఉన్నత విద్యను కొనసా గించలేక చిన్న వయసులోనే వివాహం చేసుకోవాల్సి వచ్చిందని, మరోవైపు గీత ఆర్థికంగా బలమైన కుటుంబానికి చెందిన కారణంగా చదువు పూర్తి చేసి మంచి ఉద్యోగాన్ని సాధించిందని తెలిపారు.

ఇలాంటి అసమానతలను తొలగించడంలో సివిల్ సర్వెంట్స్ కీలక పాత్ర పోషిస్తారన్నారు.అడ్మినిస్ట్రేషన్ హెడ్ అవినాష్  యూపీఎస్సీ పరీక్షకు ఎలా దరఖాస్తు చేసుకోవాలో వివరంగా తెలియజేశారు. ప్రిన్సిపాల్ కె. రఘువీర్ , వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్.తిరుమలరావు పాల్గొన్నారు.