28 April, 2026 | 4:27 AM

ఈత ఈదేది ఎలా?

28-04-2026 01:45 AM

కరీంనగర్, ఏప్రిల్27(విజయక్రాంతి) ప్రతి ఏటా వేసవిలో ప్రజల సౌకర్యార్థం  కరీంనగర్ లో దాదాపు 6 చోట్ల ఈత కొలనుల నిర్వహణ చేపడుతున్నది.గడిచిన రెండు, మూడు రోజుల నుంచి వరుసగా ఈత కొలనులను ప్రారంభిస్తున్నరు. కరీంనగర్ అంబెడ్కర్ స్టేడియం లో ఇప్పటికి 600 మంది వరకు పేరు నమోదు చేసుకున్నారు.  ప్రభుత్వ పరంగా ఈ స్విమ్మింగ్ ఫూల్ ఉన్నా  సామాన్యుని కి అందుబాటులో లేదు. వైరవిలు చేసుకున్న వారికి ప్రవేశం కల్పిస్తున్నా రు. పిల్లలకు 1300, పెద్దలకు 1600 రూపాయలు వసూలు చేస్తున్నారు. ఉదయం, సాయంత్రం నాలుగు బ్యాచ్ లు బ్యాచ్ కు 40 మంది చొప్పున శిక్షణ ఇస్తున్నారు.

కరీంనగర్ క్లబ్ తో పాటు సేంట్  జాన్స్ స్కూల్ తో పాటు మరో మూడు చోట్ల ఉన్న ఒక్కరికి 1500 నుండి 2000 రూపాయలు వసూలు  చేస్తున్నారు.పాఠశాలలకు సెలవు లు ఇవ్వడంతో, పట్టణంలో ఈత శిక్షణ శిబిరాలు సందడిగా మారుతున్నాయి. తల్లిదం డ్రులు తమ పిల్లలతో కలిసి ఈ శిబిరాలకు తరలివస్తుండటంతో ఈ సందడి నెలకొందిజిల్లా యంత్రాంగంతో పాటు, ప్రైవేట్ పాఠ శాలలు మరియు వ్యక్తులు కూడా పిల్లలకు క్రీడలు, ఆటలు, చిత్రలేఖనం, చదరంగం, నృత్యం మరియు ఇతర ఈవెంట్లలో శిక్షణ ఇవ్వడానికి వేసవి శిబిరాలను నిర్వహిస్తున్నారు.

ఇతర క్రీడాంశాలలో, ఈతకు అత్యంత ప్రాధాన్యత  ఇస్తుండటం తో  ఇవి ఇటు క్రీడల శాఖకు, ప్రైవేట్  సంస్థలకు ఆదాయ వనరులగా మారి సామాన్య, మధ్యతరగతి కుటుంబాల పిల్లలకు అందని ద్రా క్షగా మారింది. అంబేడ్కర్ స్టేడియంలోని  ఈత కొలనునురూ.35 లక్షలు ఖర్చు చేసి పునరుద్ధరించింది. పెయింటింగ్తో పాటు, విద్యుత్ వైరింగ్, ఫిల్ట్రేషన్ పనులు చేపట్టారు. స్నానాల గదులు, దుస్తులు మార్చుకునే గదులు, షవర్లు, వాష్రూమ్లను కూడా పునరుద్ధరించారు.ఈ నిధులను ఈత కోసం వచ్చే వారినుండి గుంజే ప్రయత్నమే 500 ఉన్న రేటును  మూడింతలు చేశారని కరీంనగర్ వాసులు అంటున్నారు.

చేతులెతేసిన నగరపాలక సంస్థ

ప్రతి సంవత్సరం వేసవిలో నగరపాలక సంస్థ ఉచిత వేసవి క్రీడా శిక్షణా శిబిరాలను జిల్లా కేంద్రంలో నిర్వహిస్తుంది. 2017 నుంచి ఆరుసార్లు వేసవి శిక్షణ శిబిరాలను నగరపాలక సంస్థ నిర్వహించింది. ఈ సంవత్సరం విద్యార్థులకు వేసవి సెలవులు ప్రారంభమైనప్పటికీ నగరపాలక సంస్థ నుంచి ఎలాంటి ప్రకటన రాకపోవడంతో క్రీడా శిక్షణ శిబిరాలు ఉన్నట్టా... లేనట్టా.. అనే సందేహం కలుగుతోంది. నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో 2017 నుంచి ఉచిత క్రీడా శిక్షణ శిబిరాలను జిల్లా క్రీడా శాఖ సహకారంతో నిర్వహిస్తోంది.

వేసవి సెలవుల్లో ఇంటిపట్టునే ఉంటున్న చిన్నారులకు జిల్లా కేంద్రంలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్టేడియంలో ఉచిత శిక్షణను ఇచ్చారు. నగరపాలక సంస్థ ఇంతవరకు ఈ సంవత్సరం ఎలాంటి ఉచిత క్రీడా శిబిరాల నిర్వహణ ప్రకటన చేయలేదు. కొన్ని సంవత్సరాలుగా శిక్షణ శిబిరాలను విజయవంతంగా నిర్వహించిన బల్దియ ఈ సంవత్సరం ఉచిత వేసవి క్రీడా శిక్షణా శిబిరాలను విద్యార్థులకు నిర్వహించకపోవడం తో అనేక సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ శిబిరాల నిర్వహణకు వెచ్చించాల్సిన వ్యయం పెరుగుతుండ డంతో నగరపాలక సంస్థ వెనకడుగు వేస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి.