12 May, 2026 | 11:42 PM

Breaking News

భధ్రాచలంలో ఘనంగా హనుమాన్‌ జయంతి వేడుకలు   •   హనుమాన్ సేన ఆధ్వర్యంలో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు   •   వృద్ధురాలి ఇళ్ళు కబ్జాకు యత్నం... న్యాయం చేయాలని వేడుకోలు   •   టి దుకాణాలలో స్మోకింగ్ జోన్లను ఎత్తివేయండి   •   గంజాయి కేసులో నలుగురిపై కేసు.. డి-అడిక్షన్ సెంటర్‌కు తరలింపు   •   మంత్రి తుమ్మల పేరున ప్రత్యేక ప్రార్థనలు జరిపిన దమ్మపేట ముస్లిం మైనారిటీ నాయకులు   •   వికె సీఎం ఫిట్ కమిటీ సమావేశం   •   సమ్మర్ క్యాంప్ ఆకస్మిక తనిఖీ   •   పదో తరగతి సప్లమెంటరీ విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ తరగతులు ప్రారంభం   •   ప్రభుత్వ స్థలాల్లో అక్రమ నిర్మాణాలు నిర్మిస్తే సహించం   •  

విజయనగరం జిల్లాలో బీభత్సం: నలుగురు మృతి

28-04-2026 09:54 AM

హైదరాబాద్: విజయనగరం జిల్లా( Vizianagaram district) పెరపురం గ్రామం వద్ద మంగళవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పూసపాటిరేగ జాతీయ రహదారిపై వేగంగా దూసుకొచ్చిన కారు లారీని ఢీకొట్టింది. ఇద్దరిని ఢీకొన్న అనంతరం కారు లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన ఇద్దరిని విజయనగరం ఆస్పత్రికి తరలించారు.

కారు శ్రీకాకుళం నుంచి విశాఖ వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. మరణించిన వారిలో ఒకరిని, సాగునీటి ప్రాజెక్టుల కాంట్రాక్టరుగా వ్యవహరిస్తూ విశాఖపట్నంలో నివసించే శ్రీనివాస్‌గానూ, మరొకరిని బొబ్బిలికి చెందిన సింహాచలంగానూ గుర్తించినట్లు పోలీసులు పేర్కొన్నారు. కారు డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.