డబుల్ బెడ్ రూం ఇండ్ల పేరుతో భారీ మోసం
29-10-2024 12:08 PM
హైదరాబాద్: డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పేరుతో కేపీహెచ్ బీ కాలనీలో భారీ మోసం వెలుగుచూసింది. బుకింగ్ పేరుతో 15 మంది బాధితులు నగదు చెల్లించి మోసపోయారు. ఒక్కొక్కరి నుంచి రూ. లక్షా 70 వేల నునంచి రూ. 2.5 లక్షలు వసూలు చేశారు. నకిలీ పత్రాలు, తాళాలు చూపించి నిందితుడు వేణుగోపాల్ దాస్ మోసం చేశాడు. నిందితుడు ఇచ్చిన తాళాలు తీసుకుని బాధితులు ఇళ్లకు వెళ్లారు. ఇళ్లలో అసలైన అబ్ధిదారులు ఉండటంతో బాధితులు విస్తుపోయారు. వేణుగోపాల్ దాస్ మోసం చేశాడని తెలుసుకుని బాధితులు కేపీహెచ్ బీ పోలీసులను ఆశ్రయించారు. తమకు న్యాయం చేయాలని బాధితులు కేపీహెచ్ బీ పోలీసులకు ఫిర్యాదు చేశారు.




