7 April, 2026 | 9:04 PM

చేనేత కార్మికులకు అండగా నిలవాలి: మంత్రి తుమ్మల

29-10-2024 11:56 AM

చేనేత, జౌళిశాఖపై మంత్రి తుమ్మల సమీక్ష

వస్త్రాలను టెస్కో నుంచే కోనాలి: మంత్రి తుమ్మల

హైదరాబాద్: చేనేత, జౌళి శాఖపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మంగళవారం సమీక్ష నిర్వహించారు. వివిధ శాఖల నుంచి టీజీసీవోకు వచ్చిన ఆర్డర్లు, వాటి పురోగతిపై సమీక్షలో చర్చించారు. ప్రభుత్వ సంస్థలకు కావాల్సిన వస్త్రాలను టెస్కో నుంచి కొనాలని తుమ్మల ఆదేశించారు. 2025-26కు అవసరమైన వస్త్రాల ఇండెంట్ ను వచ్చే నెల 15 లోగా ఇవ్వాలని తెలిపారు. చేనేత కార్మికులకు అందరూ అండగా నిలవాలని మంత్రి పిలుపునిచ్చారు.