భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు
03-06-2024 11:28 AM
ముంబాయి: ఎన్డీఏ కూటమి మరోసారి అధికారంలోకి వస్తుందనే అంచనాలతో మార్కెట్లో జోష్ నెలకొంది. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 2500 పాయింట్ల లాభంతో ప్రారంభమైన సెన్సెక్స్, ప్రస్తుతం 2053 పాయింట్ల లాభంతో చరిత్రలో తొలిసారిగా 76,000 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 605 పాయింట్ల లాభంతో 23,136 వద్ద కొనసాగుతోంది. భారీ లాబాల్లో ప్రభుత్వ రంగ సంస్థలు, బ్యాంకింగ్ షేర్లు, అమెరికా డాలర్ తో పోలిస్తే రూపాయి మారకపు విలువ బలపడింది. 42 పైసలు బలపడి 83 వద్ద రూపాయి మారకపు విలువ నమోదైంది.






