30 May, 2026 | 2:13 AM

భార్యను చంపి భర్త ఆత్మహత్య!

30-05-2026 01:05 AM
  1. బైకు ఇప్పించలేదని అత్తతో గొడవపడి హత్య 
  2. సంగారెడ్డి జిల్లా మారెపల్లిలో ఘటన

కొండాపూర్, మే 29: అత్త బైకు ఇప్పించలేదని భార్యతో గొడవపడి ఉరేసి చంపి, భర్త కూడా ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం మారేపల్లి గ్రామ శివారులో జరిగింది. మారేపల్లి గ్రామానికి చెందిన దాసరి అంజయ్య (25)కు 11 నెలల క్రితం నారాయణఖేడ్ ప్రాంతానికి చెందిన దాసరి యాదమ్మ(20)తో వివాహం జరిగింది. భార్యాభర్తలిద్దరూ రాంపూర్ తండా రోడ్డు సమీపంలో గల మామిడి తోటలో నివా సం ఉంటున్నారు.

శుక్రవారం దాసరి అంజ య్య.. అత్త బైకు ఇప్పించలేదని భార్యతో గొడవ పడి ఆమెను ఉరేసిన హత్య చేశాడు. అనంతరం అతడు కూడా అక్కడే ఉన్న మామిడి చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. యాదమ్మ తండ్రి సాయిలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై సోమేశ్వరి తెలిపారు. సంఘటన స్థలాన్ని సంగారెడ్డి డీఎస్పీ సత్తయ్యగౌడ్, సిఐ సుమన్ పరిశీలించారు.