14 March, 2026 | 4:44 AM

పెట్టుబడులకు గ్లోబల్ హబ్‌గా హైదరాబాద్

14-03-2026 02:00 AM
  1. ఫార్మా, డిఫెన్స్, ఏవియేషన్ రంగాలకు కీలక వేదికగా నగరం

వినూత్న విధానాలను అమలు చేయడంలో తెలంగాణ ముందంజ

చిప్స్ డిజైన్, తయారీరంగాల్లో తైవాన్, కొరియా సంస్థల కార్యకలాపాలు

జర్మనీ సాంకేతికత తోడైతే ఇంజినీరింగ్ రంగంలో మరింత ముందుకు 

జర్మన్ ప్రతినిధి బృందంతో ఐటీ, శాఖ మంత్రి శ్రీధర్‌బాబు

హైదరాబాద్, మార్చి 13 (విజయక్రాంతి): ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలతో ఆవిష్కరణల కేంద్రంగా హైదరాబాద్‌ను తీర్చిది ద్దామని ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు వెల్లడించారు. ఐటీ, ఎలక్ట్రానిక్స్ రం గాలతోపాటు ఫార్మా, డిఫెన్స్, ఏవియేషన్ పరిశ్రమలకు కూడా నగరం కీలక వేదికగా నిలుస్తోందన్నారు. ఆవిష్కరణలకు, పెట్టుబడులకు గ్లోబల్ హబ్‌గా ఎదు గుతోందని చెప్పా రు.

బ్రిక్స్ దేశాల్లో పారిశ్రామికాభివృద్ధి, పెట్టుబడులకు అనువైన వాతా వరణం, ఆధునిక సాంకేతికతల ప్రభావంపై అధ్యయనం చేయడానికి వచ్చిన జర్మన్ ప్రతినిధి బృందం శుక్రవారం సచివాలయంలో మంత్రి శ్రీధర్‌బాబును కలిసింది. ‘గ్లోబల్ బ్రిడ్జెస్’ అనే అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థ ప్ర తినిధులు ఈ బృందంలో సభ్యులుగా ఉన్నా రు.

తెలంగాణలో ఉన్న పారిశ్రామిక అవకాశాలు, అంతర్జాతీయ పెట్టుబడిదారులకు ప్ర భుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలపై మంత్రి వారితో చర్చించారు. మారుతున్న ప్రపంచ పరిస్థితులకు అనుగుణంగా సవాళ్లను ఎదుర్కొనేందు కు వినూత్న విధానాలను అమలు చేయడం లో తెలంగాణ ప్రభుత్వం దేశంలోనే ముందంజలో ఉందని ఈ సందర్భంగా శ్రీధర్‌బాబు తెలిపారు.

పరిశ్రమలకు నిరంతర విద్యుత్ సరఫరా, నీటి లభ్యతలో ఎలాంటి అంతరాయం లేకుండా చర్యలు తీసుకున్నామని చెప్పారు. ప్రభుత్వాల మార్పుతో సంబం ధం లేకుండా మెరుగైన పారిశ్రామిక విధానాలను కొనసాగిస్తూ పరిశ్రమలకు స్థిరత్వాన్ని కల్పిస్తున్నామ ని వివరించారు. భౌగోళికంగా భారతదేశం నడిబొడ్డున ఉన్న హైదరాబాద్ ఏడాది పొడవునా ఆహ్లాదకర వాతావరణం, విభిన్న సం స్కృతుల సమ్మేళనంతో కూడిన కాస్మోపాలిటన్ జీవనశైలితో ప్రపంచం నలుమూలల నుంచి వచ్చేవారికి ‘సొంత ఊరు’ అనే భావన కలిగిస్తోందని వివరించారు.

నగరం దక్షిణ భాగంలో ప్రతిష్ఠాత్మక ‘ఫ్యూచర్ సిటీ’ ప్రాజెక్టు వేగంగా రూపుదిద్దుకుంటోందని తెలిపారు. ఇందులో భాగంగా ఏర్పాటవు తున్న ఏఐ సిటీ, నెట్ జీరో సిటీ, యంగ్ ఇండి యా స్కిల్స్ యూనివర్సిటీ వంటి ప్రాజెక్టులు రాష్ట్ర భవిష్యత్తుకు బలమైన పునాది వేస్తాయ ని అన్నారు. తెలంగాణలో అపారమైన మాన వ వనరులు, టాలెంట్ పూల్ అందుబాటులో ఉండటంతో పరిశ్రమలకు నిపుణుల కొరత తలెత్తే సమస్యే ఉండదని స్పష్టంచేశారు.

ఇప్పటికే ఉద్యోగాల్లో ఉన్న వృత్తి నిపుణులతో పాటు కొత్తగా ఇంజనీరింగ్ పూర్తిచేసిన యువతను ప్రపంచస్థాయి సవాళ్లకు సిద్ధం చేయడానికి ప్రభుత్వం స్కిల్లిం గ్, రీ-స్కిల్లింగ్ కార్యక్రమాల ద్వారా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిస్తున్నట్టు చెప్పా రు. సెమీ కండక్టర్ రం గం తెలంగాణలో వేగం గా విస్తరిస్తోందని, చిప్స్ డిజైన్, తయారీ రం గాల్లో తైవాన్, కొరియా సంస్థలు ఇప్పటికే కార్యకలాపాలు ప్రారంభించాయని వివరించారు.

డేటా సెంటర్ల ఏర్పాటుకు దిగ్గజ కం పెనీలు ముందుకొస్తున్నాయని తెలిపారు. జర్మనీ సాంకేతికత తోడైతే ఇంజినీరింగ్ రం గంలో తెలంగాణ మరింత ముందుకు దూసుకెళ్తుందని విశ్వాసం వ్యక్తంచేశారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 100 ఏండ్లు పూర్తయ్యే 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు.

సమావేశంలో జర్మన్ ప్రతినిధి బృందం సభ్యులు డాక్టర్ స్టెఫాన్ ట్రేగర్, డాక్టర్ క్రిస్టియన్ అల్టెన్ హోఫెన్, ఫ్రాంక్ బీర్ హోస్ట్, అలెగ్జాండర్ వాన్‌క్రామ్, మాల్టెహొహ్‌ఫీల్డ్, ఫిలిప్ మేయర్ హోఫర్, మ్యాక్స్ మిల్లన్ వ్యాన్ లెయర్, పరిశ్రమలశాఖ డైరెక్టర్ నిఖిల్ పాల్గొన్నారు.