మహనీయుల పోరాటాలే కొత్త తరానికి స్ఫూర్తి: సీపీ రాధాకృష్ణన్‌

17-09-2026 | 11:52am

హైదరాబాద్: సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్(Parade Grounds)లో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్ విముక్తి కోసం పోరాడిన యోధులకు, సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్(Vice President CP Radhakrishnan) నివాళులర్పించారు. అనంతరం సాయుధ బలగాల గౌరవ వందనం స్వీకరించారు. సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినోత్సవంగా(Telangana Liberation Day) జరుపుకుంటున్నామని తెలిపారు.

భారత్ లో హైదరాబాద్ అంతర్భాగం కావడానికి మహనీయులు బలిదానాలు చేశారని కొనియాడారు. మహనీయుల పోరాటాలు కొత్త తరానికి స్ఫూర్తిగా నిలుస్తాయని వెల్లడించారు. 1947 ఆగస్టు 15 నుంచి జాతి నిర్మాణం కోసం పోరాటం మొదలైందని వివరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ కళారూపాలు, వేయి స్తంభాల గుడి, బతుకమ్మ శకటాల ప్రదర్శన చేశారు. ఈ కార్యక్రమానికి గవర్నర్ శివప్రతాప్ శుక్లా, కేంద్రమంత్రులు షెకావత్, కిషన్ రెడ్డి, బండి సంజయ్ కుమార్ హాజరయ్యారు.

మరిన్ని వార్తలు