14 July, 2026 | 12:19 PM

బతుకమ్మ కుంటలో హైడ్రా కమిషనర్ పర్యటన

13-11-2024 12:44 PM

హైదరాబాద్ (విజయక్రాంతి): హైదరాబాద్ అంబర్‌పేట్‌ సమీపంలోని బతుకమ్మ కుంట చెరువును హైడ్రా కమీషనర్ ఏవీ రంగనాథ్ బుధవారం పరిశీలించారు. బతుకమ్మ కుంట కబ్జాకు గురైందని మాజీ ఎంపీ వి. హనుమంతరావు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో రంగనాథ్ బతుకమ్మ కుంటను పరిశీలించారు. హైడ్రా కమిషనర్ పర్యటనతో బతుకమ్మ కుంటకు పూర్వ వైభవం వచ్చేలా హైడ్రా ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలో స్థానికుల నుంచి వ్యతిరేకత వస్తుందని భావించిన పోలీసులు ముందు జాగ్రత్తగా భారీ పోలీసు బందోబస్తు చేశారు.