calender_icon.png 6 June, 2025 | 7:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అల్వాల్‌లో హైడ్రా కూల్చివేతలు

05-06-2025 09:45:25 AM

హైదరాబాద్: అల్వాల్‌లో అక్రమ నిర్మాణాలపై హైడ్రా(Hyderabad Disaster Relief and Asset Protection Agency) కొరడా కొరడా ఝులిపించింది. చినరాయుని చెరువు లో నిర్మిస్తున్న మూడు భవనాలను గురువారం హైడ్రా అధికారులు కూల్చివేసారు. నివేదికల ప్రకారం, చిన్నరాయన చెరువులోని ఎఫ్ టీఎల్ (FTL) ప్రాంతంలో మూడు భవనాలు నిర్మించబడ్డాయని ఆరోపిస్తూ స్థానిక ప్రజలు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. నిర్మాణ పనుల కారణంగా వర్షాకాలంలో చుట్టుపక్కల ప్రాంతాల నుండి ట్యాంక్‌లోకి ప్రవహించే నీరు నిలిచిపోతుందని, కాలనీలలోని ఇళ్లలోకి నీరు చేరుతుందని స్థానిక ప్రజలు ఆరోపించారు. తనిఖీ తర్వాత, గురువారం స్థానిక పోలీసుల సహకారంతో హైడ్రా బృందాలు భవనాన్ని కూల్చివేత పనులు చేపట్టాయి. కూల్చివేస్తుండగా నిర్మాణదారులకు, హైడ్రా అధికారులకు మధ్య స్పల్ప వాగ్వాదం చోటుచేసుంది.