20 March, 2026 | 5:21 PM

Breaking News

షబ్బీర్ అలీని కలిసిన భిక్కనూర్ కాంగ్రెస్ నాయకులు   •   రీడింగ్ ఛాంపియన్షిప్ పోటీల విజేతలకు బహుమతి ప్రధానం చేసిన ఎంఈఓ రాజయ్య   •   తాసిల్దార్ కార్యాలయం నూతన భవనం మంజూరు కోసం వినతి   •   భిక్కనూర్ జెడ్పీ పాఠశాలలో నైపుణ్యాభివృద్ధి ల్యాబ్‌ల ప్రారంభం   •   జగన్, షర్మిల ఆస్తుల పంచాయతీ.. వైఎస్ విజయమ్మ సంచలన ప్రకటన   •   సేలంలో ఘోర రోడ్డు ప్రమాదం: ఎనిమిది మంది మృతి   •   కాంగ్రెస్‌ది చోర్ విధానం.. బడ్జెట్‌పై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు   •   పెరిగిన 'పవర్‌' పెట్రోల్‌ ధర   •   300 ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించిన ఢిల్లీ సీఎం   •   ముంబై ప్రెస్ క్లబ్‌కు 'గ్యాస్ బాంబు' బెదిరింపు   •  

నేను నిర్దోషిని: హేమ

09-07-2024 12:05 AM

ఇటీవల బెంగళూరు రేవ్ పార్టీ కేసులో పోలీసులు నటి హేమను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. దీంతో మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) నుంచి సస్పెండ్ చేసినట్టు ‘మా’ ప్రకటించింది. ఈ అంశంపై హేమ ఓ బహిరంగ లేఖ విడుదల చేశారు. దాన్ని మా అధ్యక్షుడు మంచు విష్ణుకు సోమవారం అందజేశారు హేమ. తాను నిర్దోషినని ఆ లేఖలో పేర్కొన్నారామె. ‘మీడియా నాపై నిరాధారమైన ఆరోపణలు చేసిన నేపథ్యంలో దేశంలోనే అత్యున్నత ప్రమాణాలున్న ల్యాబ్‌లో నేను పరీక్షలు చేయించుకున్నా.

వాటిలో నేను డ్రగ్స్ తీసుకోలేదని స్పష్టమైంది. త్వరలో పోలీసులు చేసిన పరీక్షల్లోనూ ఇవే రిజల్ట్స్ వస్తాయని నాకు నమ్మకం ఉంది. ఈలోపే మా సభ్యత్వం రద్దు చేయడం సరైంది కాదని నేను భావిస్తున్నా. కొన్ని రోజులుగా జరుగుతున్న ప్రచారంతో నేను తీవ్ర మానసిక క్షోభకు గురవుతున్నా. నాకు అండగా ఉండాలని కోరుకుంటూ సస్పెన్షన్ ఎత్తివేస్తారని ఆశిస్తున్నా’ అని పేర్కొన్నారు.