20 March, 2026 | 6:50 PM

Breaking News

షబ్బీర్ అలీని కలిసిన భిక్కనూర్ కాంగ్రెస్ నాయకులు   •   రీడింగ్ ఛాంపియన్షిప్ పోటీల విజేతలకు బహుమతి ప్రధానం చేసిన ఎంఈఓ రాజయ్య   •   తాసిల్దార్ కార్యాలయం నూతన భవనం మంజూరు కోసం వినతి   •   భిక్కనూర్ జెడ్పీ పాఠశాలలో నైపుణ్యాభివృద్ధి ల్యాబ్‌ల ప్రారంభం   •   జగన్, షర్మిల ఆస్తుల పంచాయతీ.. వైఎస్ విజయమ్మ సంచలన ప్రకటన   •   సేలంలో ఘోర రోడ్డు ప్రమాదం: ఎనిమిది మంది మృతి   •   కాంగ్రెస్‌ది చోర్ విధానం.. బడ్జెట్‌పై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు   •   పెరిగిన 'పవర్‌' పెట్రోల్‌ ధర   •   300 ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించిన ఢిల్లీ సీఎం   •   ముంబై ప్రెస్ క్లబ్‌కు 'గ్యాస్ బాంబు' బెదిరింపు   •  

ఆగస్టు 2న ఉషా పరిణయం

09-07-2024 12:05 AM

‘నువ్వే కావాలి’, ‘మన్మథుడు’, ‘మల్లీశ్వరి’ వంటి ఫ్యామిలీ ఎంటర్‌టైర్స్ అందించిన దర్శకుడు కె.విజయ్ భాస్కర్. ఆయన డైరెక్షన్‌లో వస్తున్న తాజా చిత్రం ‘ఉషా పరిణయం’. లవ్ ఈజ్ బ్యూటీఫుల్ అనేది ఉప శీర్షిక. దర్శకుడు విజయ్ భాస్కర్ ఈ చిత్రం ద్వారా తన కుమారుడు శ్రీ కమల్‌ను హీరోగా పరిచయం చేస్తున్నారు. శ్రీ కమల్‌కు జోడీగా నటిస్తున్న తాన్వి ఆకాంక్ష అనే తెలుగమ్మాయికి కూడా ఇది మొదటి సినిమానే. సరికొత్త ప్రేమకథతో తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్టు 2న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. అలీ, వెన్నెల కిషోర్, శివాజీ రాజా, ఆమని, సుధ, ఆనంద చక్రపాణి, సూర్య, రవి, శివతేజ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: ఆర్‌ఆర్ ధ్రువన్; డీవోపీ: సతీశ్ ముత్యాల.