నా తదుపరి చిత్రానికి నేనే డైరెక్టర్!
లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు తన ప్రతిష్టాత్మక సినిమా ‘సింగ్ గీతం’తో ముందుకు వస్తున్నారు. ఈ చిత్రాన్ని వైజయంతి మూవీస్, స్వప్న సినిమా పతాకాలపై నాగ్‌అశ్విన్ నిర్మించారు. ఆయాన్, అహల్యా బమ్రూ, శాలిని కొండెపుడి ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. జూన్ 11న థియేటర్లలో విడుదల కానున్న సినిమా విశేషాలను హీరోయిన్ శాలిని కొండెపుడి విలేకరులతో పంచుకుంది. ఆ విశేషాలు ఆమె మాటల్లోనే..
* ఈ చిత్రంలో ఒక నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్ర ఉం దని తెలిసింది. సింగీతం సినిమా అంటే ఎలాంటి పాత్ర అయినా చే యాలని నిర్ణయించు కున్నా. ఆడి షన్ ఇచ్చిన నెల తర్వాత ఓకే చేశారు.
* ఇంతకు ముందు కు ‘మై డియర్ దొంగ’ సిని మా నేనే రాశా. నా తర్వాతి సినిమా కథ కూ డా నేనే రాస్తున్నా. అందుకే నేనే డైరెక్ట్ చేస్తే బాగుంటుందనిపించింది. ఆ సినిమా నా డైరెక్షన్ లోనే కామెడీ జానర్‌లో వస్తుంది. ప్రేక్షకులను నవ్వించే సినిమాలు చేయడం నాకు ఇష్టం.
* ఈ సినిమాలో నేను చేసిన విలన్ పాత్ర చాల బలమైనది. తాను అనుకున్నది సాధించాల నుకునే మనస్తత్వం ఉన్న మనిషి. తాను నమ్మిందే నిజమని భావించే -ఈ పాత్రలో చాలా షేడ్స్ ఉన్నాయి. కథలో చాలా కీలకమైన పాత్ర ఇది. హీరో, హీరోయిన్ పాత్రలతోపాటు నా పాత్ర కూడా చాలా వినోదాత్మకంగా వుంటుంది. ఇలాంటి పాత్రలు తరచూ రావు.
ఇది పూర్తిగా ఒరిజినల్ కాన్సెప్ట్. దీనికి ఎలాంటి సినిమా రిఫరెన్స్ లేదు. మాకు ఉన్న ఏకైక రిఫరెన్స్ సింగీతం విజన్ మాత్రమే. నాగ్‌అశ్విన్ సెన్సిబిలిటీ కూడా సినిమాలో కనిపిస్తుంది. --ఇది భారతీయ సినీ చరిత్రలోనే తొలి మ్యూజికల్ కామెడీ ఫిల్మ్. ఈ కథ ఆలోచన సింగీతం సర్‌కు చాలా ఏళ్ల క్రితమే వచ్చింది. ఈ రోజుకీ ఎంతో రిలెవెంట్‌గా అనిపించే కథ ఇది. సింగీతం ప్రతి అంశాన్ని స్వయంగా పర్యవేక్షిస్తూ, తన విజన్ ప్రకారమే సినిమా రూపొందింది. ఇందులో -పాటలు పాడే నటులు చాలామంది ఉంటారు. కానీ ఇందులో మాటలనే పాటలాగా పాడాలి. అదే అసలు ఛాలెంజ్. సాధారణంగా గాయకులు పాట పాడేటప్పుడు ఒక విధంగా వాయిస్, మాట్లాడేటపపుడు మరో విధంగా వుంటుంది. కానీ ఇందులో మాట్లాడటమే పాటగా మారిపోతుంది. అది చాలా కష్టమైన ప్రక్రియ. -దేవిశ్రీ ప్రసాద్ మాటలను పాటలుగా అద్భుతంగా మార్చారు. ఆయన సంగీతం గొప్ప బలాన్నిచ్చింది.






