పుట్టినరోజు కానుక సిద్ధం!
నందమూరి బాలకృష్ణ హీరోగా దర్శకుడు గోపీచంద్ మలినేని ఓ భారీ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ‘వీరసింహా రెడ్డి’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత వీరిద్దరి కాంబోలో వస్తున్న ఈ సినిమా ప్రస్తుతం ‘ఎన్‌బీకే111’ అనే వర్కింగ్ టైటిల్‌తో ప్రచారంలో ఉంది. పవర్‌ఫుల్ యాక్షన్, భారీ స్థాయి మేకింగ్‌తో రూపొందుతున్న ఈ చిత్రాన్ని వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై నిర్మాత వెంకట సతీశ్ కిలారు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ముంబయిలో శరవేగంగా జరుగుతోంది.
ప్రధాన తారాగణం పాల్గొంటుండగా, కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా జూన్ 10న ఈ చిత్రం నుంచి ఓ అప్డేట్‌ను విడుదల చేయనున్నారు. ఈ మేరకు టీమ్ విడుదల చేసిన పోస్టర్ ఆకట్టుకుంటోంది. ‘నో మోర్ వింటేజ్, ఓన్లీ న్యూ ఏజ్’ అనే ట్యాగ్‌లైన్‌తో ఈ పోస్టర్.. బాలకృష్ణ సరికొత్త అవతారంలో కనిపిస్తారన్న సంకేతాలిస్తోంది. మిగతా టీమ్ వివరాలను మేకర్స్ త్వరలో ప్రకటించనున్నారు.






